Laila Movie : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న'లైలా' ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే!

విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రిలీజ్‌ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌ కళ్లు మాత్రమే చూపించారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Laila Movie : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న'లైలా' ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే!

Vishwak Sen Laila Movie First Look: టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మరో ప్రయాగానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా 'గామి' లో అఘోరాగా మెప్పించిన ఈ హీరో ఈసారి అమ్మాయిగా మారబోతున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం లేడీ గెటప్ తో (Female Getup) ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్నాడు. ఇటీవలే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా 'లైలా' అనే సినిమాలో నటిస్తున్నాడు.

నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటిస్తుండగా.. ఆకాంక్ష శర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.

Also Read : 6 రోజుల్లో రూ.615 కోట్లు.. ‘కల్కి’ దెబ్బకు రజనీకాంత్‌, విజయ్‌ల రికార్డులు బ్రేక్..!

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్...

రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ నిర్మించనుంది. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించి రిలీజ్‌ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌ కళ్లు మాత్రమే చూపించారు. ఇందులో హీరోయిన్లను మించి ఎంతో అందంగా విశ్వక్ కళ్ళు ఉన్నాయి. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ 'లైలా'లాంటి డిఫెరెంట్ ప్రాజెక్ట్ ను ఎంచుకోవడం విశేషం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలు కానుంది.

Advertisment
తాజా కథనాలు