Vishwak Sen : ప్రభాస్ 'కల్కి' పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!

'కల్కి' మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు.' సినిమాపై ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి' అని అన్నాడు.

Vishwak Sen : ప్రభాస్ 'కల్కి' పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!
New Update

Vishwak Sen Fires On Youtuber : 'మహానటి' మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం ‘కల్కి 2898AD’ (Kalki 2898). వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా కల్కి మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అవుతూ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

పైరసీ కంటే డేంజర్

బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ (Barbell Pitch Meetings) ర‌న్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబ‌ర్ 'క‌ల్కి' సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై విశ్వక్ సేన్ రియాక్ట్ అవుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. అందులో.."సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని కొంద‌రూ బయలుదేరుతున్నారు. యూట్యూబ్‍లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‍లు అయిపోయాయి మీకు.

Also Read : ‘పుష్ప 2’ వాయిదాతో హర్ట్ అయిన అభిమాని.. కోర్టులో కేసు వేస్తా అంటూ మేకర్స్ పై ఆగ్రహం!

వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు, మీ ఒపీనియన్‍కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.

publive-image

#kalki-2898-ad #vishwak-sen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe