Vishwak Sen : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని సినీ క్రిటిక్స్ పై ఫైర్ అయ్యాడు. సినిమాని చూసి అందులోని వీక్‌ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు. కానీ సినిమా చూడకుండా రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు అని అన్నాడు.

Vishwak Sen : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్!
New Update

Vishwak Sen Fires On Movie Critics : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు చైతన్య కృష్ణ, హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా చూడకుండానే కొందరు రివ్యూలు రాస్తున్నారని సినీ క్రిటిక్స్ (Cine Critics) పై ఫైర్ అయ్యాడు.

సినిమా చూడకుండానే రివ్యూలు రాశారు.. 

సినిమా రిలీజ్ అయిన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై రీసెంట్ గా టాలీవుడ్ (Tollywood) లో డిస్కషన్ జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్ విశ్వక్ సేన్ ను ప్రశ్నించగా.. అందుకు విశ్వక్ బదులిస్తూ.. " వారం సంగతేమోగానీ మా సినిమా చూడకుండా ఉదయం 6 గంటలకే రివ్యూలు రాశారు.

Also Read : హిమాలయాల్లో సింపుల్ వైట్ షర్ట్ లో రజినీకాంత్… వైరల్ అవుతున్న ఫోటో..!

సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన వాటిలో ఒకటైన సంగీతం బాగాలేదని రివ్యూల్లో ఉంది. వాళ్ళు సినిమా చూడలేదని అక్కడే అర్థమైంది. సినిమాని చూసి అందులోని వీక్‌ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు. కానీ సినిమా చూడకుండా రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు. అంతేకాదు టికెట్‌ కొన్న వారికే బుక్‌ మై షోలో రేటింగ్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి" అని అన్నాడు. దీంతో విశ్వక్ సేన్ సినీ క్రిటిక్స్ పై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#tollywood #vishwak-sen #gangs-of-godavari-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe