Janasena : జనసేన పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం(Visakhapatnam) సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్(Vamsi Krishna Srinivas Yadav) ను పవన్ ప్రకటించారు. విశాఖ సౌత్ టికెట్‌పై తీవ్రంగా కసరత్తు చేశారు పవన్(Pawan Kalyan). మొదట విశాఖ సౌత్ టీడీపీకి ఇచ్చి.. భీమిలీ టికెట్ తీసుకోవాలని భావించింది జనసేన. అయితే టీడీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విశాఖ సౌత్ నుంచే పవన్ అభ్యర్థిని ప్రకటించారు.
ప్రజారాజ్యంతో మొదలు:
చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన విశాఖలో పుట్టారు. ఎంఏ వరకు చదువుకున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోచయారు. 2011లో వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
నాడు దక్కని టికెట్:
వంశీకృష్ణ శ్రీనివాస్ 2019లో వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు. ఆయన 2021లో మహా విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 12, 2021న వైసీపీ పార్టీ ప్రకటించింది. డిసెంబర్ 8, 2021న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ డిసెంబర్ 27, 2023న వైసీపీకి రాజీనామా చేసి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.
Also Read : సత్తుపల్లిలో పోలీసులపై గిరిజనులు దాడి..సీఐ కిరణ్‌ను కర్రలతో ఎలా కొట్టారో చూడండి!