Virat Kohli Deepfake Video: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఇటీవలే సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ గేమింగ్ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విరాట్ సైతం ఓ బెట్టింగ్ యాప్‌ను (Betting APP) ప్రచారం చేస్తున్నట్లు ఓ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ లో కోహ్లీ యాడ్‌ను ప్రసారం చేసినట్లు క్రియేట్ చేశారు సైబర్ కేటుగాళ్లు.
ఈజీ మనీ..
ఈ మేరకు 'తక్కువ పెట్టుబడితో భారీగా డబ్బులు సంపాదించుకోండి. ఈజీ మనీ కోసం ఇది ఉత్తమమార్గం' అంటూ విరాట్ చెబుతున్నట్లు అందులో చూపించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుండగా అది నకిలీదని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. జనాలు ఇది నమ్మొద్దని సూచిస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై విరాట్ ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి : Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్!
ఇక ఇటీవల సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా ఫేక్ వీడియోపై స్పందించి దానిని ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పారు. టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆందోళన చెందారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక సచిన్ కూతురు సారా డీప్‌ఫేక్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే రష్మిక (Rashmika Mandanna), కత్రినాకైఫ్ మార్ఫింగ్ వీడియోలు ఇటీవల సంచలన సృష్టించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.