ICC T20 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 పోటీల్లో విరాట్ కోహ్లి (Virat Kohli) కొత్త రికార్డ్ సృష్టించాడు. అయితే, ఇది బాధాకరమైన రికార్డ్ కావడమే అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకూ టోర్నీలో మూడు మ్యాచ్ లు జరిగాయి. మూడు మ్యాచ్ లలోనూ కోహ్లి మొత్తంగా పది బంతులు కూడా ఆడలేకపోయాడు. ఐర్లాండ్ (Ireland) తో మొదటి మ్యాచ్ లో 1 పరుగు.. పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన ఏందో మ్యాచ్ లో 4 పరుగులు చేసిన కోహ్లి బుధవారం అమెరికాతో మూడో మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. వరుస మ్యాచ్ లలో కోహ్లీ విఫలం అవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఓపెనర్ గా వచ్చి అలా అవుట్ అవుతుండడం తరువాత బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇక అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తానాడిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ వేసిన ఓవర్ మొదటి బంతికే కీపర్ కు ఈజీ క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుటయ్యాడు. దీంతో టీ20ల్లో 6వ సారి ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు కోహ్లీ.
రెండో స్థానం..
T20 World Cup Record : టీ20ల్లో గోల్డెన్ డకౌట్స్ విషయంలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకూ ఏకంగా రోహిత్ 12 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇప్పటివరకూ రోహిత్ తరువాత కేఎల్ రాహుల్ ఉండేవాడు. అతను మొత్తం ఐదు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇప్పుడు ఆరోసారి గోల్డెన్ డకౌట్ అవడం ద్వారా రాహుల్ ను వెనక్కి నెట్టి లిస్ట్ లో రెండో ప్లేస్ లోకి చేరుకున్నాడు కోహ్లీ.
Also Read: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ
ఇదిలా ఉంటె టీ20 వరల్డ్ కప్ లో గోల్డెన్ డకౌట్ అయిన వారి లిస్ట్ లో ఇప్పుడు కోహ్లీ కూడా చేరాడు. ఇప్పటివరకూ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, సురేశ్ రైనా వంటి ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు కోహ్లీ చేరాడు.
టీ20లలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన భారత్ బ్యాటర్లు వీరే..
- రోహిత్ శర్మ 12 సార్లు
- విరాట్ కోహ్లీ 6 సార్లు
- కేఎల్ రాహుల్ 5 సార్లు
టీ20 ప్రపంచకప్‌లలో గోల్డెన్ డక్ అయిన భారత్ బ్యాటర్లు..
- దినేష్ కార్తీక్ (Dinesh Karthik) -2007 దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో
- మురళీ విజయ్ -2010 దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో
- ఆశిష్ నెహ్రా -2010 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో
- సురేష్ రైనా -2016 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో
- రోహిత్ శర్మ - 2021 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో
- రవీంద్ర జడేజా -2024 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో
- జస్ప్రీత్ బుమ్రా -2024 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో
- విరాట్ కోహ్లీ -2024 అమెరికా తో జరిగిన మ్యాచ్ లో
మొత్తంగా చూసుకుంటే.. కోహ్లీ గోల్డెన్ డకౌట్స్ రికార్డ్ అభిమానులను టెన్షన్ పెడుతోంది.