IND vs SA: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్‌.. ఎందుకంటే?

డిసెంబర్‌ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది.ఇంతలోనే కోహ్లీ ఇండియా ఫ్లైట్ ఎక్కి రిటర్న్ వచ్చేశాడు. కారణాలు తెలియదు కానీ.. 'ఫ్యామిలీ ఎమర్జెన్సీ' అని తెలుస్తోంది. అయితే మ్యాచ్‌ సమయానికి కోహ్లీ దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చేస్తాడని సమాచారం.

New Update
IND vs SA: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్‌.. ఎందుకంటే?

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) గ్రౌండ్‌లోకి దిగలేదు. మెగా టోర్నీ తర్వాత ఇండియా రెండు సిరీస్‌లు ఆడింది. ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడింది. అందులో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా(South Africa) ఫ్లైట్ ఎక్కారు టీమిండియా కుర్రాళ్లు. సఫారీలపై టీ20, వన్డే సిరీస్‌లు ఆడారు. టీ20 సిరీస్‌ డ్రా అవ్వగా.. వన్డే సిరీస్‌ భారత్‌ గెలుచుకుంది. ఇక మిగిలింది టెస్టు సిరీస్‌.. నిజానికి ఈ టెస్టు సిరీస్‌ కోసమే ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ కావడంతో కిక్‌ ఉంటుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై టీమిండియా ఎలా ఆడుతుందోనన్న ఆసక్తి కూడా ఉంటుంది. ఈ టెస్టు సిరీస్‌ కోసమే కోహ్లీతో పాటు కెప్టెన్‌ రోహిత్ శర్మ సైతం టీ20, వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు దక్షిణాఫ్రికాకు చేరుకోని ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టారు. ఇంతలోనే కోహ్లీ అర్థంతరంగా ప్రాక్టీస్‌ను ఆపేసి ఇండియా ఫ్లైట్ ఎక్కాడు.

Also Read: పక్షిలా ఎగురుతూ పట్టేశాడు.. ఫీల్డింగ్ లోనూ మెరిసిన సాయి సుదర్శన్

కోహ్లీ ఎందుకు ఇండియా రిటర్న్‌ అయ్యాడు?
మరో నాలుగు రోజుల్లో టెస్టు సిరీస్‌ మొదలు కానుంది. డిసెంబర్‌ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు రోహిత్‌, కోహ్లీ కీలకం. ఇంతలోనే కోహ్లీ ఇండియా ఫ్లైట్ ఎక్కి రిటర్న్ వచ్చేశాడు. కారణాలు తెలియదు కానీ.. 'ఫ్యామిలీ ఎమర్జెన్సీ' అని బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే.. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే జట్టులోకి తిరిగి వస్తానని కోహ్లీ బీసీసీఐకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని బీసీసీఐ కూడా కన్‌ఫామ్‌ చేసింది. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే తొలి టెస్టు సమయానికి కోహ్లీ తిరిగి వస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ధృవీకరించాయి. అంతకుముందు, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వ్యక్తిగత విషయంపై టెస్ట్ సిరీస్ కోసం జట్టు నుంచి బయటకు వచ్చాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌కి అతని స్థానంలో కేఎస్ భరత్‌ని ఎంపిక చేశారు.

భారత ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వేలిలో ఫ్రాక్చర్ కారణంగా రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఉంగరపు వేలు ఫ్రాక్చర్‌తో రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో క్యాచ్ కోసం ప్రయత్నించగా గైక్వాడ్ వేలికి గాయమైంది. రుతురాజ్‌ స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తుందో బీసీసీఐ ఇప్పటివరకు చెప్పలేదు. ఈ యువ బ్యాటర్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరు జట్టులో చేరుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్‌ భరత్ (వికెట్ కీపర్).
Also Read: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్

WATCH:

Advertisment
తాజా కథనాలు