Virat Kohli: అతను నా గురువు..సచిన్ అంత గొప్ప ఆటగాడిని కాను-విరాట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. నిన్న సౌతాఫ్రికా మ్యాచ్లో సచిన్ సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టి గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. దీని మీద భావోద్వేగంతో స్పందించిన విరాట్...ఏం చేసినా తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని మాత్రం కాదంటున్నాడు. By Manogna alamuru 06 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sachin is my hero - Virat Kohli : వరల్డ్ కప్ లో (World Cup) నిన్న సౌతాఫ్రికాను చిత్తు చిత్తు చేసింది భారత్. ఇందులో రికార్డు సెంచరీ చేసి టీమ్ ఇండియా గెలుపుకు బాటలు వేశాడు. దీంతో పాటూ జడేజా బంతితో నిప్పులు కురిపించడంతో సౌతాఫ్రికా అత్యంత తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. టీమ్ ఇండియా 243 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో హైలట్ గా నిలిచింది మత్రం విరాట్ కోహ్లీ శతకం (Virat Kohli Century). నిన్న అతని పుట్టినరోజు కావడం...అదే రోజు అతనికి ఆదర్శం , గాడ్ అయిన సచిన్ (Sachin Tendulkar) రికార్డ్ ను సమం చేయడం విరాట్ జీవితంలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయింది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు (49 శతకాలు) చేసిన క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ ను విరాట్ సమం చేశాడు. Also Read:రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. మ్యాచ్ తరువాత తన శతకం మీద స్పందించాడు కింగ్ కోహ్లీ (Virat Kohli). చాల భావోద్వేగానికి గురయ్యాడు. భారత్ తరుఫున ఆడేందుకు వచ్చే ప్రతీ అవకాశం గొప్పదే అన్నాడు విరాట్. నా హీరో రికార్డ్ సమం చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నా. బ్యాటింగ్ లో అతనే గొప్ప. నేను అతనంత పరఫెక్షనిస్ట్ ను కాదు. జనాలు నన్ను అతనితో పోల్చి సంతోషడుతున్నారు కానీ నేను మాత్రం సచిన్ అంత గొప్పవాడిని కాదంటూ ఎమోషనల్ అయిపోయాడు విరాట్. నా పుట్టినరోజు నాడు సెంచరీ సాధించడం ఒక డ్రీమ్ లా ఉంది. సచిన్ ఆటను చూస్తూ నేను పెరిగాను. అలాంటిది ఇప్పుడు స్వయంగా సచినే వచ్చి నన్ను అభినందించడం చాలా అమూల్యం. ఇంత ఆనందాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది అంటూ ఉద్వేగానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో పాటూ అభిమానులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. నా ఈ విజయాన్ని, ప్రత్యేకరోజును ఫ్యాన్స్ మరింత ప్రత్యేకంగా మార్చారని అన్నాడు. నాకు ఇంతటి అదృష్టం తక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని అంటున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) #virat-kohli #india #sachin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి