India vs Australia World Cup 2023: ఆరంభం అదుర్స్.. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం.. ఆరంభం అదిరిపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప స్కోర్‌కే కంగారూలను కట్టడి చేసిన టీమిండియా.. లక్ష్య చేధనలతో తొలుత తడబడినా.. ఆ తరువాత పుంజుకుని ఘన విజయం సాధించింది. By Shiva.K 08 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India vs Australia World Cup 2023: ఆరంభం అదిరిపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప స్కోర్‌కే కంగారూలను కట్టడి చేసిన టీమిండియా.. లక్ష్య చేధనలతో తొలుత తడబడినా.. ఆ తరువాత పుంజుకుని ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో.. ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించి.. జయకేతనం ఎగురవేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్ట్రాంగ్‌గా నిలబడి మ్యాచ్‌ను గెలిపించారు. విజయ తీరానికి చేరే క్షణంలో కోహ్లీ ఔట్ అయినా.. తరువాత వచ్చిన హార్థిక్ పాండ్య కూడా రాణించడంతో మ్యాచ్ ఘన విజయం సాధించారు. 41వ ఓవర్‌లో 2వ బంతికి కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టి విజయానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక 5వ వికెట్‌గా వచ్చిన హార్థిక్ పాండ్య.. 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఒకే ఒక్కడు.. ఒకే ఒక్కడు.. అవును ఒకే ఒక్కడు జట్టును విజయ తీరానికి చేర్చాడు. గతంలోనూ ఇలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి. కానీ, అవి వేరు ఇది వేరు అని చెప్పుకోవాలి. వరుసగా మూడు వికెట్లు జీరో స్కోర్‌తో పడిపోయిన వేళ.. క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్.. తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పాడు. మాజీ కెప్టెన్ విరాట్‌తో కలిసి జట్టు స్కోర్ పెంచిన రాహుల్.. హార్థిక్‌తో కలిసి మ్యాచ్‌కు ఫిషినిషింగ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకు తొలి విజయాన్ని బహుమతిగా అందించాడు. విరాట్‌తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రాహుల్.. తానొక్కడే 97* పరుగులతో అజేయంగా నిలిచాడు. 115 బంతుల్లో 97 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. KL Rahul finishes off the chase with a MAXIMUM! 😎 He remains unbeaten on 97* & #TeamIndia start #CWC23 with a superb win against Australia 🙌 Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/rZRXGei1QN — BCCI (@BCCI) October 8, 2023 కుమ్మేసిన జోడీ.. ఓపెనర్ ఇషాన్ కిషన్ సహా తరువాత ఇద్దరు ప్లేయర్స్ డకౌట్ అయి.. జట్టు పరిస్థితి దిగజారిపోగా.. ఆ ఇద్దరే టీమ్‌కి అండగా నిలబడ్డారు. వారే.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. క్రీజ్‌లో ఫిల్లర్స్ మాదిరిగా సెట్ అయిపోయి.. ఆసిస్ బౌలర్స్‌కు చుక్కలు చూపించారు. బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూనే.. ఇద్దరూ కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియాను విజయ పథానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. చివరి క్షణంలో విరాట్ ఔట్ అయినా.. తన ఇన్నింగ్స్ మాత్రం అదరగొట్టాడు. 116 బంతుల్లో 86 పరుగులు చేసి మ్యాచ్ విజయం కీలక పాత్ర పోషించాడు. 1⃣5⃣0⃣ partnership up now between Virat Kohli & KL Rahul 👏👏#TeamIndia need 48 runs more to win now 👌👌 Follow the Match ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/mQVyiUsXb1 — BCCI (@BCCI) October 8, 2023 India overcome an early wobble to take their opening #CWC23 by a comfortable margin 💪#INDvAUS 📝: https://t.co/Qh7kBjviYJ pic.twitter.com/pbTH3UMLkf — ICC (@ICC) October 8, 2023 Also Read: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..! Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..! #india-won #icc-world-cup-india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి