Virat Kohli Birthday: అతని ఆట క్లాసిక్.. కానీ.. వ్యాపార రంగంలో అతని బ్రాండ్ ఫుల్ మాసివ్. బ్యాట్ పట్టుకుంటే సమయానుసారంగా ఎలాగైతే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడో.. ప్రముఖ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్ గా ఇతర ఆటగాళ్లను మించి డబ్బులు సంపాదిస్తాడు. ఆధునిక క్రికెట్ లో అతనో పరుగుల మిషన్. ప్రస్తుత వరల్డ్ కప్ లో అతని బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూసి అన్ని టీమ్స్ వణికిపోతున్నాయి. అతనే అభిమానులు ముద్దుగా కింగ్ కొహ్లీ అని పిలుచుకునే విరాట్ కొహ్లీ. ఈరోజు అంటే నవంబర్ 5వ తేదీ అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి మామూలుగా లేదు. ప్రపంచ కప్ పోటీలు.. అదీ భారత్ వేదికగా జరుగుతున్న ఈ సమయంలో కొహ్లీ పుట్టినరోజు రావడం.. ఈరోజు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతుండడంతో ఇక అభిమానుల సంబరాలకు హద్దులు లేకుండా పోయాయి. ప్రపంచంలో ఏ క్రీడాకారునికి లేని అభిమానగణం విరాట్ సొంతం. అలాగే ప్రపంచంలో టాప్ ఆటగాళ్లతో సమానమైన బ్రాండ్ విలువ ఉన్న క్రీడాకారుడు కూడా కోహ్లినే. అందుకే కొహ్లీ పుట్టినరోజు సందర్భంగా అతని ఆస్తులు.. బ్రాండ్ అంబాసిడర్ గా అతని సంపాదన సుమారుగా ఎంత ఉంటుందో.. వివిధ సందర్భాల్లో అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన సమాచారం ఆధారంగా తెలుసుకుందాం.
ఐపీఎల్ లో కింగ్..
ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఏ వేలంలోకీ కొహ్లీ(Virat Kohli Birthday) పేరు వెళ్ళలేదు. 2008లో జరిగిన ఐపీఎల్ మొదటి వేలంలో RCB అతనిని కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. తరువాత అతను 2011 వరకు వరుసగా మూడు సీజన్‌లకు రూ.2.4 కోట్ల పేమెంట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ ఫ్రాంచైజీకి పరిమితం అయ్యాడు. ఆ ఫ్రాంచైజీ అంటిపెట్టుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ(Virat Kohli) నిలిచాడు. 2011- 2014 మధ్య కోహ్లీ ఏడాదికి రూ.8.2 కోట్లు అందుకున్నాడు. 2013లో జట్టు పూర్తికాల కెప్టెన్‌గా అయ్యాడు. 2015 -2017 మధ్య కాలంలో కోహ్లీకి ఆర్సీబీ రూ.12.5 కోట్ల వేతనం చెల్లంచింది. 2022లో మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ అతనిని రూ.15 కోట్లకు అంటిపెట్టుకుంది. అతను 2023 సీజన్‌లో కూడా అదే వేతనాన్ని తీసుకున్నాడు.
2015 -2017 మధ్య కాలంలో కోహ్లీకి ఆర్సీబీ రూ.12.5 కోట్ల వేతనం చెల్లంచింది. 2022లో మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ అతనిని రూ.15 కోట్లకు అంటిపెట్టుకుంది. అతను 2023 సీజన్‌లో కూడా అదే వేతనాన్ని తీసుకున్నాడు.
Also Read: 35 ఏట అడుగుపెట్టిన విరాట్ కొహ్లీ.. అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు
సోషల్ మీడియాలో విఖ్యాత రూపం..
కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు రూ.11.5 కోట్లు, ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కు రూ.2.5 కోట్లను వసూలు చేస్తాడని చెబుతారు. అతనికి ఇతర విలువైన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. విరాట్ కొహ్లీకి(Virat Kohli Birthday) గురుగ్రామ్‌లో దాదాలు ఉన్నాయి. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడా వ్యాపారాల్లోనూ కోహ్లీకి వాటా ఉంది. అతను ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ ఎప్‌సీ గోవా, టెన్నిస్ క్లబ్, ప్రో-రెజ్లింగ్ జట్టులో కూడా కోహ్లీ మేజర్ షేర్ హోల్డర్ గా ఉన్నాడు.
వ్యాపార సామ్రాట్..
విరాట్ కోహ్లి(Virat Kohli Birthday) అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. ఢిల్లీలో అతనికి ఒక రెస్టారెంట్ ఉంది. అతను బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో, ఇతర స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాడు. కోహ్లీ అనేక ప్రముఖ బ్రాండ్‌లతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ.7.50 నుంచి రూ.10 కోట్ల వరకు కోహ్లీ ఛార్జ్ చేస్తాడు.
క్రికెట్ ద్వారా వచ్చేది ఇంతే..
బీసీసీఐ ఒప్పందం ప్రకారం "A" కేటగిరీ కింద కోహ్లికి సంవత్సరానికి రూ.7 కోట్లు చెల్లిస్తారు. అతను ప్రతి టెస్ట్ మ్యాచ్‌కి రూ.15 లక్షలు, ప్రతి వన్డేకు రూ. 6 లక్షలు, ఒక T20 మ్యాచ్ ఆడినందుకు రూ.3 లక్షలను బీసీసీఐ నుంచి సంపాదిస్తాడు. అంతేకాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ జట్టులో భాగమైనందుకు సంవత్సరానికి రూ.15 కోట్లను కోహ్లీ అందుకుంటున్నాడు.
Watch this interesting video: