/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-23-2-jpg.webp)
Virat Kohli - Anushka Sharma Blessed With Baby Boy: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 20 మంగళవారం నాడు తమ రెండవ సంతానం అకాయ్ (Akaay) అనే మగబిడ్డ పురుడుపోసుకున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram
మీ ఆశీర్వాదాలు కోరుతున్నాం..
'మమల్ని ప్రేమించే హృదయాలకు ప్రేమతో.. ఫిబ్రవరి 15న మేము వామిక (Vamika) చిన్న సోదరుడు.. మా అబ్బాయి అకాయ్ ని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మేము మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుతున్నాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం' అంటూ అనుష్క షేర్ చేసిన పోస్టులో రాసుకొచ్చారు.
Also Read: 8 లక్షల టిప్ వచ్చింది..కానీ ఉద్యోగం పోయింది
ఇక ఈ దంపతులకు 2021లో తొలి సంతానం వామికాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు కోహ్లీ (Virat Kohli) ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరమవడంపై ఉత్కంఠ వీడినట్లైంది.