ఆ టాలీవుడ్ హీరో నాకు మంచి ఫ్రెండ్.. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా, నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు : విరాట్ కోహ్లీ టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని విరాట్ కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అభిమాన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని తెలిపిన విరాట్.. కొన్నేళ్ల క్రితం తారక్ తో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆ టైం లో ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యానని అన్నాడు. By Anil Kumar 26 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Virat Kohli About Junior NTR : 'RRR' తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవెల్ కి చేరిన విషయం తెలిసిందే. సామాన్యులు, సినీ సెలెబ్రిటీలు మాత్రమే క్రికెటర్స్ సైతం తారక్ ని ఎంతగానో అభిమానిస్తుంటారు. అటు తారక్ కూడా క్రికెట్ అంటే చాల ఇష్టం మన టీమిండియా క్రికెటర్స్ హైదరాబాద్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్ పలువురు క్రికెటర్స్ ని ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ని అభిమానించే క్రికెటర్స్ లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం చేరాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్.. ఎంతగానో అభిమానిస్తా టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. తన అభిమాన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని తెలిపిన విరాట్.. కొన్నేళ్ల క్రితం తారక్ తో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆ టైం లో ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యానని అన్నాడు. ఎన్టీఆర్ ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు నచ్చుతుందని, RRR సినిమాలో అతని యాక్టింగ్ గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవని ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా సినిమాలో నాటు నాటు డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుందని, అనుష్కతో కలిసి నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ చాలా రీల్స్ చేసినట్లు పేర్కొన్నాడు. గత ఏడాది మ్యాచ్ జరుగుతున్న టైం లో RRR కి ఆస్కార్ వచ్చిందని తెలిసి, స్టేడియంలో నాటు నాటు స్టెప్ వేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపాడు. అంతేకాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతానని వెల్లడించాడు. దీంతో ఎన్టీఆర్ పై విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. #virat-kohli #junior-ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి