Viral Video: గడ్డం ఉన్న అబ్బాయిలు వద్దంటూ అమ్మాయిల ఆందోళన

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అమ్మాయిలు నో క్లీన్‌ షేవ్‌.. నో లవ్‌ అంటూ వీధుల్లో ప్లకార్డులతో పాటు కృత్రిమ గడ్డాలు పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గడ్డమైనా మర్చిపోండి..లేదా గర్ల్‌ఫ్రెండ్‌నైనా మర్చిపోండి అంటూ వినూత్న ప్రదర్శనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

Madhya Pradesh

Madhya Pradesh

New Update

Madhya Pradesh: చాలా మంది అమ్మాయిలు గడ్డం ఉన్న అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అమ్మాయిలు మాత్రం దానికి భిన్నంగా ఆందోళనకు దిగారు. వీధుల్లో ప్లకార్డులతో పాటు కృత్రిమ గడ్డాలు పెట్టుకుని మరీ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నో క్లీన్‌ షేవ్‌.. నో లవ్‌ అంటూ బోర్డులు ప్రదర్శించారు. ఈ అమ్మాయిల గ్యాంగ్‌ ర్యాలీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాలీలో అమ్మాయిలు క్లీన్ షేవ్ చేసుకున్న బాయ్‌ఫ్రెండ్‌లకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకున్నారు. గడ్డాన్ని అయినా మర్చిపోండి..లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని అయినా మర్చిపోండి అంటూ వినూత్న ప్రదర్శనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఏదైనా యాడ్‌ ప్రమోషన్‌..

అయితే ఇది రీల్స్‌ కోసం చేశారా లేక ఏదైనా యాడ్‌ ప్రమోషన్‌ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో చూసిన అబ్బాయిలు మాత్రం రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మీ కోసం మా గడ్డాలు తీసేయాలా అని కొందరు అంటుంటే.. మరికొందరు మీకు గడ్డం నచ్చకపోతే క్లీన్‌షేవ్‌ ఉన్నవాళ్లనే సెలెక్ట్‌ చేసుకోండంటూ కామెంట్లు పెడుతున్నారు.

చిన్న విషయానికి కూడా రోడ్డుకెక్కి ఇంత రచ్చచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చరిత్రలో ఋషులు వెచ్చదనం కోసం గడ్డాలు పెంచేవారు. గడ్డం ఉండటం వల్ల చర్మానికి ఎంతో రక్షణ లభిస్తుందని నమ్మేవారు. అనేక సంస్కృతులలో, పురాతన ఈజిప్టులోని ఫారోల వంటివారు కూడా గడ్డాలు పెంచేవారని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తొక్కే కదా అని పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే వదిలిపెట్టరు

#agra-viral-video
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe