Banana Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే వదిలిపెట్టరు

అరటిపండులో తొక్క బరువు 36-42 గ్రాములు ఉంటుంది. ఈ తొక్కలో ఫైబర్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, శక్తి అధికం, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలన్న, మానసిక స్థితితోపాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
banana peel

Banana Peel

Banana Peel: మనం అరటిపండ్లను ఎంతో ఇష్టంగా తింటాం. అరటిపండులో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే అరటిపండ్లు తిన్నాక తొక్కను చెత్త బుట్టలో వేస్తాం. కానీ అందులోనూ పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. సగటు అరటిపండు బరువు 120-150 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ బరువులో 30-35 శాతం కేవలం పైతొక్క మాత్రమే. అంటే 120 గ్రాముల అరటిపండులో తొక్క బరువు 36-42 గ్రాములు ఉంటుంది. ఈ తొక్కలో ఫైబర్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అరటి పండు రుచికరమైనది మాత్రమే కాదు సూపర్ ఫుడ్‌గా కూడా పరిగణించబడుతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, దీనిని రోజూ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు. అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం సంవృద్ధిగా ఉంటాయి.

జీర్ణక్రియకు మంచిది:

  • అరటిపండులో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

శక్తి అధికం:

  • అరటి తక్షణ శక్తిని అందిస్తుంది. అథ్లెట్లు, వ్యాయామం చేసే వ్యక్తులు తమ ఆహారంలో అరటిని అందుకే తీసుకుంటారు.

గుండె ఆరోగ్యానికి మేలు:

  • అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

బరువుకి చెక్‌:

  • అరటిపండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది చాలా కాలం పాటు ఆకలిని అణిచివేస్తుంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మానసిక స్థితి

  • అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పొగాకు నిషేధిస్తే ఇంత మంది ప్రాణాలు కాపాడొచ్చా..?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు