దివ్యాంగ కోటాలో జాబ్ కొట్టి ఐటమ్ సాంగ్‌ డ్యాన్స్ వేసిన మహిళ.. చివరికి బిగ్ ట్విస్ట్

దివ్యాంగుల కోటాలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న మహిళ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో ఆమె ఉద్యోగం సాధించిందని, వెంటనే ఆమెను జాబ్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

New Update
govt job women dance

govt job women dance Photograph: (govt job women dance )

వికలాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ మహిళా ఉద్యోగి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వివాదాస్పంగా మారింది. డిజబుల్డ్ సర్టిఫికెట్ పెట్టి ఇటీవలే ఎక్సైజ్ శాఖలో విధులు చేపట్టిన ఆమె.. యువకులతో కలిసి స్టేజీపై డ్యాన్స్ చేసిన వీడియోలతో ఆమె వికలాంగురాలేనా అనే అనుమానం ప్రజల్లో వచ్చింది. దీంతో ఓ విద్యార్థి సంస్థ ఫిర్యాదుతో సర్కార్ విచారణకు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియాంక కదమ్‌ అనే యువతి వికలాంగుల కోటా కింద ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించింది. జిల్లా ఎక్సైజ్ అధికారిగా ఎంపికైన ఆమె గత శుక్రవారం ఓ వేడుకలలో యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక కదమ్‌ వికలాంగురాలు కాదని.. ఆమె చక్కగా డ్యాన్స్ చేస్తుందని, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సాధించిందని, వెంటనే ఆమెను జాబ్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..? 


వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఉద్యోగ నియాకకంపై ఎంక్వైరీకి ఆదేశించారు. అంతేకాక ప్రియాంక కదమ్‌ జిల్లా ఎక్సైజ్ అధికారిని తొలగించి ఉజ్జయినిలోని ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెకు జిల్లా ఎక్సైజ్ అధికారి పోస్ట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అలాగే వికలాంగుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులందరినీ భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు వారి సర్టిఫికేట్‌లను ధృవీకరించాలని కోరారు. 2017లో బాత్‌రూమ్‌లో పడిపోవడంతో తన తుంటికి తీవ్ర గాయమైందని ప్రియాంక కదమ్ తెలిపింది. MRI స్కాన్‌లో అవాస్కులర్ నెక్రోసిస్ ఉందని తేలిందని, ఆ తర్వాత 4 సార్లు శస్త్రచికిత్స జరిగిందని, తనకు 45 శాతం వైకల్యం ఉందన్న ఆమె వివరించింది. పరిశీలించి చూస్తేనే వికలాంగురాలిగా కనిపిస్తానని ఆమె చెప్పారు.

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు