పబ్లిక్ లో పెళ్లి చీర చింపి.. ఘనంగా విడాకుల పార్టీ!

ఓ మహిళ 'హ్యాపీ డివోర్స్' అంటూ తన విడాకులను సెలెబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కేక్ కట్ చేయడంతో పాటు తన పెళ్ళికి సంబంధించిన ముసుగును కత్తెరతో సంతోషంగా కట్ చేసింది. అలాగే తన పెళ్లి ఫొటోలను కూడా చింపేసింది.

New Update
happy divorce

happy divorce

Viral Video:   ఒకప్పుడు పెళ్లంటే మూడునాళ్ళ ముచ్చకాదు ... నూరేళ్ళ బంధం అనేవారు. కానీ ఇప్పుడు జరిగే చాలా పెళ్లిళ్లు మూడునాళ్ళ ముచ్చగానే మిగిలిపోతున్నాయి. ఈ మధ్య సమాజంలో ఎంతో మంది భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి వారి అందమైన వైవాహిక జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. అయితే పెళ్లిని ఘనంగా జరుపుకోవడం అందరం చూసుంటాము. కానీ విడాకులను కూడా సెలెబ్రేట్ చేసుకోవడం ఎప్పుడైనా చూసారా..? ఇప్పుడు ఓ మహిళ తన విడాకులను కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

కేక్ కట్ చేసి.. పెళ్లి చీరను చింపేసి.. 

అయితే ఈ వీడియోలో ఓ మహిళ 'హ్యాపీ డివోర్స్' అంటూ కేక్ కట్ చేయడం చూడవచ్చు. కేక్ కట్ చేయడమే కాదు తన పెళ్ళికి సంబంధించిన ముసుగును కత్తెరతో సంతోషంగా కట్ చేసింది. అలాగే తన పెళ్లి ఫొటోలను చింపివేసింది. అయితే ఈ మహిళకు 2020లో వివాహం జరిగింది.  కానీ వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో.. విడాకులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరుపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలా చేయడం విష సంబంధాల నుంచి స్వేచ్ఛను సూచిస్తుందా..? లేదా మారుతున్న సమాజపు వైఖరికి సంకేతమా..? అని కామెంట్లు పెడుతున్నారు. 

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు