/rtv/media/media_files/2025/06/03/whRcuUsMTScDJOFnUzuO.jpg)
viral news: mbbs doctor married to hospital house keeper
Viral News: ప్రేమకు కులం, మతం డబ్బు, హోదా అవసరంలేదు అనేది కేవలం కొటేషన్ మాత్రమే కాదు నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందని నిరూపించారు ఈ జంట. ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ తన ఆస్పత్రిలో పనిచేసే హౌస్ కీపింగ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లంటే.. అబ్బాయికి డబ్బు, హోదా, చదువు ఉండాలని ఆలోచిస్తున్న ఈ జనరేషన్ లో.. కేవలం అతడి స్వచ్ఛమైన మనసుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన ఈ అమ్మాయి అందరినీ ఫిదా చేసింది. ట్రూ లవ్.. అంటే ఇదేనేమో అనేలా ఉంది ఈ జంట ప్రేమ కథ. అసలు ఈ కథ ఎవరిదా? అని ఆలోచిస్తున్నారు. డాక్టర్ కిశ్వర్ సాహిబా, షెహజాద్ల ప్రేమ కథ ఇది.
మొదటి చూపులోనే..
కిశ్వర్ సాహిబా అనే యువతి ఎంబీబీఎస్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. షెహజాద్ కూడా అదే ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి చూపులోనే షెహజాద్ పై మనసుపడిన కిశ్వర్ అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే కీశ్వర్.. షెహజాద్‌ను మొదటిసారి చూసినప్పుడు అతడు తన కంటికి క్లీనర్ లేదా "ఛాయ్‌వాలా" లాగా కనిపించలేదట. పనిపట్ల అతడి శ్రద్ధ, నిబద్దత, నిరాడంబరమైన శైలి మాత్రమే తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపింది. ముఖ్యంగా అతడు క్లీనింగ్ స్టైల్ తనకు బాగా నచ్చిందని చెప్పారు డాక్టర్ కీశ్వర్.
షెహజాద్ షాక్
ఈ క్రమంలోనే కీశ్వర్ తనలోని ప్రేమను షెహజాద్‌కు వ్యక్తపరిచింది. కానీ కిశ్వర్ లాంటి ఉన్నత విద్యావంతురాలు, డాక్టర్ తనను ఎందుకు ప్రేమిస్తుందని మొదట షాక్ అయ్యాడు షెహజాద్. దీంతో ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. సమాజంలో తన స్థానం ఏంటి, ఆమె స్థానం ఏంటి అని ఆలోచించి భయపడ్డాడు. కానీ మెల్లిగా.. కిశ్వర్ ప్రేమలోని నిజాయితీని అర్థం చేసుకున్న షెహజాద్.. ఆమె ప్రేమను ఒప్పుకున్నాడు. ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించడం తన అదృష్టంగా భావించాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు ఇది కదా నిజమైన ప్రేమ అంటే అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్