/rtv/media/media_files/2025/10/01/taylor-a-humphrey-2025-10-01-21-28-48.jpg)
పుట్టిన పిల్లలకు పేరు పెట్టేందుకు తల్లిదండ్రులు ఎవరైనా రూ.26 లక్షలు ఇస్తారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రైలర్ ఎ. హంఫ్రీ అనే మహిళ 'ప్రొఫెషనల్ బేబీ నేమర్'గా ప్రసిద్ధి చెందింది. ఆమె శిశువులకు పేర్లు పెట్టేందుకు ఏకంగా $30,000 (సుమారు ₹26 లక్షలు) వరకు వసూలు చేస్తోంది. ఒకప్పుడు సరదాగా ప్రారంభించిన ఈ పని ఇప్పుడు ఆమెకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కేవలం పేరు పెట్టే పుస్తకాలను తిరగేయడం కాకుండా, తల్లిదండ్రుల అంచనాలకు తగ్గట్టుగా, ఆధునికతతో పాటు కాలాతీతమైన పేర్లను ఎంపిక చేయడంలో ఆమె ప్రత్యేకత సాధించింది. ఆమె VIP ప్యాకేజీలో కుటుంబ చరిత్ర పరిశోధన, వంశపారంపర్య వివరాల సేకరించి, ఆ బిడ్డకు పేరు 'బ్రాండింగ్'గా నిలిచేలా చూడటం వంటి సర్వీసులో ఉన్నాయి.
2020లో ఆమె సుమారు 100 మంది శిశువులకు పేర్లు పెట్టింది. ప్రస్తుతం ఆమె వద్ద 500 కంటే ఎక్కువ పేర్ల పోర్ట్‌ఫోలియో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సేవపై విమర్శలు ఉన్నప్పటికీ, తమ పిల్లల పేరు ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే ధనవంతులు, సెలబ్రిటీలు హంఫ్రీ సేవలను ఉపయోగించుకోవడానికి వెనుకాడడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డ పేరును 'ఓ గుర్తింపు పెట్టుబడి'గా భావించడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది.