/rtv/media/media_files/2026/01/25/nihilist-penguin-2026-01-25-18-30-42.jpg)
ప్రముఖ జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జాగ్ 2007లో అంటార్కిటికాలో 'ఎన్‌కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీ తీశారు. అందులోని ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఒక అడెలీ పెంగ్విన్ తన గుంపును వదిలేసి, ఆహారం దొరికే సముద్రం వైపు వెళ్లకుండా.. ఎముకలు కొరికే చలి ఉండే సుదూర మంచు పర్వతాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ పెంగ్విన్ వెళ్తున్న దారిలో మృత్యువు తప్ప ఏమీ ఉండదని తెలిసినా, అది వెనక్కి తిరిగి చూడకుండా సాగించే ఆ ప్రయాణం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.
nihilist penguin isn’t lost.
— Kevihaiceth 💹🧲 (@Kevihaiceth) January 25, 2026
it’s what acting with conviction looks like when nothing is guaranteed. pic.twitter.com/SvIXGSn9ap
2026లో ఎందుకు వైరల్ అవుతోంది?
ఈ పాత క్లిప్ 2026లో వైరల్ అవ్వడానికి రావడానికి కారణం ప్రస్తుత కాలంలో మానసిక స్థితి. ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ బాధ్యతలు, సోషల్ మీడియా ఒత్తిడితో విసిగిపోయిన నెటిజన్లు, ఆ పెంగ్విన్ ప్రవర్తనలో తమను తాము చూసుకుంటున్నారు. ఇక చాలు.. నేను కూడా అన్నింటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి" అనే భావనకు ఈ పెంగ్విన్ ఒక చిహ్నంగా మారింది.
నిహిలిజం: జీవితానికి అర్థం లేదని భావించే తాత్విక చింతనే నిహిలిజం అంటారు. ఈ పెంగ్విన్ తన మనుగడకు అవసరమైన ఆహారం, రక్షణను కాదని అర్థం లేని పర్వతాల వైపు వెళ్లడం వల్ల దీనికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టారు. డోనాల్డ్ ట్రంప్ వంటి రాజకీయ నాయకులు, అలాగే రెడ్ బుల్, ఢిల్లీ పోలీస్ వంటి సంస్థలు ఈ సీన్ వాడి మీమ్‌లా సొంత పోస్ట్‌లు చేయడంతో ఇంకా వైరల్ అయ్యింది.
నెటిజన్లు దీన్ని ఒక తిరుగుబాటుగా లేదా తాత్విక ప్రయాణంగా భావిస్తున్నప్పటికీ, శాస్త్రవేత్తలు మాత్రం దీనికి వేరే వివరణ ఇస్తున్నారు. పెంగ్విన్లు కొన్నిసార్లు దారి తప్పడం, అనారోగ్యం లేదా మెదడు సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి వింత ప్రవర్తనను ప్రదర్శిస్తాయని పరిశోధకుడు డేవిడ్ ఐన్లీ పేర్కొన్నారు. ఆ పెంగ్విన్ తెలివిగా వెళ్లడం లేదని, అది కేవలం గందరగోళంతో ప్రాణాలకు ముప్పు ఉన్న దిశగా వెళ్తోందని వారు చెబుతున్నారు. కారణం ఏదైనా, ఆ పెంగ్విన్ సాగించే నిశ్శబ్ద పోరాటం 2026లో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
Follow Us