/rtv/media/media_files/2025/08/25/mona-lisa-photo-controversy-2025-08-25-20-43-02.jpg)
ఓనం పండుగ ప్రచారంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ పోస్ట్ చేసిన మోనాలిసా ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకళాఖండమైన మోనాలిసా ఫొటోని AIతో కేరళ సంప్రదాయ దుస్తులలో చూపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కేరళ టూరిజం ఓనం ప్రచారంలో భాగంగా AI-తో క్రియేట్ చేసిన ఓ ఫొటోని విడుదల చేసింది. అందులో మోనాలిసా కేరళలోని సంప్రదాయ కాసవు చీరను ధరించి, తలకు మల్లెపూలు, నుదుటిపై బొట్టుతో కనిపిస్తోంది. ఈ ఫొటోకి "టైమ్‌లెస్. గ్రేస్‌ఫుల్. ఐకానిక్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో కొందరు ప్రసంశలు కురిపిస్తే మరికొందరు విమర్శించారు. లియోనార్డో డా విన్సీ గీసిన ఈ చిత్రాన్ని మార్చడం తప్ప అని అంటున్నారు. ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Timeless. Graceful. Iconic.
— Kerala Tourism (@KeralaTourism) August 21, 2025
The Kerala kasavu saree.#Meme#Monalisa#OnamDestination#OnamFestKerala#LandOfHarmony#Onam#OnamBeyondBorders#FestivalofEquality#KeralaTourismpic.twitter.com/syjikd5xBC
ఈ వివాదంపై సెలబ్రెటీలు, ఫేమస్ ఆర్టిస్టులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సతీష్ మూర్తి ప్రకారం, మోనాలిసా చిత్రం ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఉంది, కాబట్టి దానిని ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్లుగా మార్చవచ్చని అన్నారు. లూవ్రే మ్యూజియంతో సహా ఎవరికీ దానిపై కాపీరైట్ హక్కులు లేవని ఆయన తెలిపారు.
అయితే, తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఐఎస్‌టి సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.ఎస్. ప్రవీణ్ రాజ్ మరో కోణంలో ఈ వివాదాన్ని విశ్లేషించారు. రచయిత చనిపోయిన తర్వాత కూడా వారి నైతిక హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 57 ప్రకారం, ఆర్టిస్టుల గౌరవం లేదా ప్రతిష్టకు భంగం కలిగించేలా వారి పనిని వక్రీకరించడం లేదా మార్చకుండా నిరోధించే హక్కు వారికి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం ప్రపంచంలోని ప్రాచీన కళాఖండాలను మార్చడంపై చర్చకు దారితీసింది. పర్యాటక శాఖ తమ ఓనం పండుగను ప్రమోట్ చేయడానికి ఈ చిత్రాన్ని ఉపయోగించినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 5న తిరువోణం రోజుతో ముగిసే ఈ ఉత్సవాలను సందర్శించడానికి పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
Kerala Tourism,