Video Viral: షాకింగ్‌ న్యూస్.. పెర్ఫ్యూమ్ వాడితే క్యాన్సర్..

పెర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయట. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. చర్మంపై బ్యాక్టీరియాపెరిగి.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది చర్మ క్యాన్సర్‌కు దారితీస్తుంది.

New Update

Perfume: ప్రతిరోజు పెర్ఫ్యూమ్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. నిజానికి పెర్ఫ్యూమ్‌లను.. ఆల్కహాల్‌తో పాటు వివిధ రసాయనాలను కలిపి తయారు చేస్తారు. చాలా మంది పెర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేస్తారు. దీని వల్ల భయంకరమైన చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయంటున్నారు నిపుణులు.

పెర్ఫ్యూమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే..

ఇలా చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ అప్లై చేసినప్పుడు.. పెర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ చర్మంలోని తేమను గ్రహిస్తుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఇందులో ఉండే న్యూరోటాక్సిన్స్ కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. పెర్ఫ్యూమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇందులోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది చర్మ క్యాన్సర్‌కు దారితీస్తుంది. పెర్ఫ్యూమ్‌లు శరీరంలోకి అధికంగా చేరితే.. శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఇది కూడా చదవండి: పూల పండుగ ముగింపు.. సద్దుల బతుకమ్మతో సమాప్తం

Advertisment
Advertisment
తాజా కథనాలు