Viral Video: సినిమా థియేటర్ లో టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. RGVకే చికాకు పెట్టించారు కద బ్రో..!

అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పే ఓ వీడియోను సోషల్‌మీడియాలో రాంగోపాల్‌ వర్మ షేర్ చేశారు. థియేటర్‌లో దీపావళి బాంబులు, రాకెట్లు పేల్చుతున్న సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ వీడియోను పోస్ట్ చేశాడు.

New Update
Viral Video: సినిమా థియేటర్ లో టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. RGVకే చికాకు పెట్టించారు కద బ్రో..!

Viral Video: బుద్ధుందా..? అసలు బ్రెయిన్‌ ఉందా? మనుషులేనా? అసలు ఏం అనాలి వీళ్లని.. ఏ ఆస్పత్రిలో చూపించాలని ఈ మూర్ఖులని. పిచ్చి వంద రకాలు.. వెర్రి వెయ్యి విధాలు.. సినిమా హీరోల అభిమానుల పిచ్చి, వెర్రి మాత్రం కోటి రకాలు. అందరూ ఇలానే ఉండరు కదా అని అనుకోవచ్చు.. అందరూ ఉండకపోతే ఏముందు.. వాళ్లని వెనకేసుకొచ్చేవారు ఎక్కువే ఉన్నారు. కదా.. మన చుట్టూనే తిరుగుతున్నారు కదా.. వాళ్ల జీవితాలనే కాకుండా పక్కొడి జీవితాన్ని కూడా నాశనం చేసే స్కిల్‌ ఈ హీరోల పిచ్చి అభిమానుల దగ్గరే ఉంటుంది. దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలంటే నీ ఇంటి బయట కాల్చుకో.. లేకపోతే ఏదైనా గ్రౌండ్‌కు వెళ్లి కాల్చుకో.. నీ పిచ్చి పరకాష్టకు చేరితే నీ నట్టింట్లోనే తగలబెట్టుకో.. థియేటర్‌లో కాల్చుతారా? అది కూడా షో ఆఫ్‌ కోసం.. మా హీరో రేంజ్‌ ఇది అని చెప్పుకోవడం కోసం ఇంత బుర్రతక్కువ పని ఎవరైనా చేస్తారా? సారీ అసలు బుర్రే ఉంటే ఇలా ఎందుకు చేస్తారు.. బుర్ర తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని ఆలోచించడం మనదే తప్పు!


ఆ మాత్రం బుద్ధి లేదా?
ఇటీవలే సల్మాన్‌ ఖాన్‌ నటించిన టైగర్‌-3 మూవీ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కి క్రేజ్‌ ఎక్కువేనన్న విషయం తెలిసిందే. అయితే ఆ క్రేజ్‌ ఒక మెంటల్‌ డిజార్డర్‌గా మారితే ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసేలా చేశారు ఆయన ఫ్యాన్స్. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ షేర్ చేసిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ముందుగా షాక్‌ అయ్యారు. తర్వాత ఈ పనికిమాలిన షో ఆఫ్‌ చేసిన వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. థియేటర్‌లో సినిమా ప్లే అవుతుండగా.. సల్మాన్‌ను చూడగానే ఆపుకోలేకపోయిన ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ క్రాకర్స్‌ వెలిగించారు. సినిమా రన్‌ అయ్యేది ఒక తెర మీద అని తెలుసు.. చుట్టూ వందలాది మంది ఉన్నారని తెలుసు.. అక్కడ టపాసులు కాల్చడం ఎంత ప్రమాదమో కదా.. ఈ విషయాలన్ని సామాన్యులకు తెలుసు కానీ.. ఫ్యానిజం వెర్రితలలు వేసే వారికి తెలియదు.. బాంబులు తీసి విచ్చలవీడిగా థియేటర్‌ అంతా కాల్చేశారు అభిమానులు.


ఇది మొదటి సారి కాదు:
థియేటర్‌లో టపాసులు పేల్చుతూ గంతులేస్తున్న వారిని చూసి ఏం అనాలో నెటిజన్లకు అర్థంకావడంలేదు. మధ్యలో ఒకడైతే ఏకంగా రాకెట్‌ ఎగరేశాడు భయ్యో.. ఇంకోడు భూచక్రం తిప్పాడు.. మరొకడు షాట్స్‌ వెలిగించాడు.. థియేటర్‌ అంతా ఒకటే మోత.. నిప్పురవ్వలు ఎగిరి ఎక్కడైనా అంటుకుంటే ఏం జరిగేది? వందలాది కుటుంబాలు వీధిన పడేవి. ఆ టపాసుల వల్ల తమకు ఏమైనా అవుతుందోనని కొంతమంది పరుగులు తీశారు. మరికొందరు మాత్రం వాటిని వీడియో రికార్డు చేశారు. వీళ్లది డెర్‌నెస్‌ కాదు.. విచక్షణారాహిత్యం..! ఇలా సల్మాన్‌ ఫ్యాన్స్‌ థియేటర్‌ని మరుభూమిగా మార్చే ప్రయత్నం చేయడం ఇది తొలిసారి కాదు.. 2021లోనూ ఇలానే చేశారు. 2021లో 'యాంటీమ్: ది ఫైనల్ ట్రూత్' విడుదల సందర్భంగా, అభిమానులు థియేటర్‌లో ఇలానే టపాసులు పేల్చారు. ఆ విషయాన్ని సీరీయస్‌గా తీసుకున్న సల్మాన్‌ అప్పుడే వారికి చివాట్లు పెట్టాడు.. అయినా తోక వంకరే కదా..!

Also Read: సెహ్వాగ్‌కు అత్యున్నత గౌరవం.. డాషింగ్‌ ఓపెనర్‌కు ఐసీసీ సలామ్!

WATCH:

#tiger-3 #diwali-2023 #salman-khan #ram-gopal-varma
Advertisment
తాజా కథనాలు