Viral Video : ప్రసవవేదనలో శ్రీకృష్ణ గానామృతం..ఆ తల్లి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా!

బిడ్డను ప్రసవించడం తల్లికి పునర్జన్మ అంటారు. తనకు సిజేరియన్ జరుగుతుంటే.. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఒక తల్లి శ్రీకృష్ణ స్తోత్రాన్ని జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గానం కొనసాగుతుండగా డాక్టర్స్ ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు. 

New Update
Viral Video : ప్రసవవేదనలో శ్రీకృష్ణ గానామృతం..ఆ తల్లి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా!

Pregnant Singing : బిడ్డని కనడం తల్లికి పునర్జన్మ లాంటిది. నవమాసాలు మోయడం ఒక ఎత్తయితే.. బిడ్డను కనేటప్పుడు పడే ప్రసవవేదన ఒక ఎత్తు. అంతవరకూ తనకున్న శక్తిని అంతా.. బిడ్డను బయటకు తీసుకురావడంలో ఉపయోగించాల్సిన పరిస్థితి. ఒక పక్క శారీరక బాధ.. మరో పక్క మానసికంగా ఉండే ఆందోళన.. వీటిని పంటి బిగువన భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఒక్కోసారి తల్లికి ఆరోగ్యరీత్యా ప్రసవించే శక్తి లేకపోతె.. లేదా ఏదైనా ఇబ్బంది ఎదురైతే సిజేరియన్ అంటే చిన్న ఆపరేషన్ తో బిడ్డకు జన్మనిస్తారు వైద్యులు. ఇది కూడా తల్లికి కష్టమైనా ప్రక్రియే. దానిని ఎదుర్కోవడానికి కూడా చాలా ధైర్యం కావలసి వస్తుంది. ఎంత డాక్టర్లు ఉన్నా.. కుటుంబం తోడుగా నిలబడినా ప్రసవ సమయం (Delivery Time) లో ఆందోళన లేకుండా మనసును కుదురుగా ఒక దగ్గర ఉంచుకోవడం చాలా క్లిష్టమైన పని ఏ తల్లికైనా. ఎటువంటి ఆందోళనా లేకుండా ఉండటానికి ప్రసవ సమయంలో గర్భిణీలు చాలా మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. సాదరంగా డాక్టర్స్ వారితో ఎదో ఒకటి మాట్లాడిస్తూ.. తన మూడ్ ని రిలాక్స్ మోడ్ లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 

Viral Video : మనది హైందవ సంసకృతి నరనరానా నింపుకున్న ప్రపంచం. భగవంతుని ఎన్నిరకాలుగా కొలిచే వీలు ఉంటుందో అన్నిరకాలుగాను కొలిచే సంప్రదాయాలు ఉన్న సంస్కృతి. అంతేకాదు.. మన సంప్రదాయాల్లో మంత్రాలు, భజనలు, భక్తి గీతాలాపనలు వంటి వాటితో మనసును స్వాంతన పరుచుకోవడం జరుగుతుంది. కష్టం వచ్చినా.. ఆనందం చుట్టుముట్టినా కృష్ణా అనుకుంటూ భగవన్నామ స్మరణ చేయడం చాలా సహజంగా జరుగుతుంది. ఇదేమిటి.. ప్రసవ వేదన గురించి చెబుతూ మధ్యలో భక్తి ప్రవచనాలు మొదలు పెట్టారు అనుకుంటున్నారా? అవును.. రెండిటికీ మధ్యలో ఒక లింక్ ఉంది. అదేమిటంటే.. 

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ (Instagram) లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో ఒక యువతికి సిజేరియన్ ఆపరేషన్ జరుగుతోంది. అది కాదు అక్కడ విశేషం.. సిజేరియన్ జరుగుతున్న సమయంలో ఆ యువతి కృష్ణ భజనలు పాడుతూ ఉండడం. తన ప్రసవ వేదన మర్చిపోవడానికి.. ఆపరేషన్ సమయంలో నొప్పిని భరించే శక్తి కోసం.. మానసికంగా తన ఆందోళనలను దూరం చేసుకోవడం కోసం ఆమె ఎంచుకున్న మార్గం.. కృష్ణుని భక్తి గీతాలు పాడుకోవడం. ఆ తల్లి తన తీయని కంఠ స్వరంతో శ్రీకృష్ణుని ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే..’’ అనే గీతాన్ని పాడుతుండగా డాక్టర్లు సిజేరియన్ చేశారు. ఆమె శ్రీకృష్ణ నామ జపం (Sri Krishna Bhajan) లో ముచ్చటైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. 

ఈ మొత్తం విషయాన్ని వీడియోగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ లో rajahmudry_pointofview2.0 అనే హ్యాండిల్ నుంచి “భక్తి-శక్తి” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ఇప్పటివరకూ దాదాపుగా రెండు మిలియన్ల మంది చూశారు. దాదాపుగా 9 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ పోస్ట్ పై కామెంట్స్ కూడా ఎక్కువగా  రావడం గమనార్హం. అందరూ ఆమెకు కచ్చితంగా కృష్ణుడే పుట్టి ఉంటారు అంటూ.. ఆ తల్లి ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ వీడియో పోస్ట్ మీరూ ఇక్కడ చూడొచ్చు.. 

Also Read : హైదరాబాద్ లో దారుణం.. కత్తితో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు