Kohli: ఇందుకే కద భయ్యా కోహ్లీని కింగ్‌ అనేది.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!

టీమిండియా క్రికెటర్‌ కోహ్లీకి ఎంత మంచి మనసుందో చూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని దూరం నుంచే కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అది గమనించిన విరాట్‌ అతడిని దగ్గరకు పిలిచి మరి సెల్ఫీ దిగాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తవగా ఫ్యాన్స్‌ అందరూ విరాట్‌కి విషెస్‌ చెబుతున్నారు.

Kohli: ఇందుకే కద భయ్యా కోహ్లీని కింగ్‌ అనేది.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
New Update

Virat Kohli heartwarming gesture to a fan: టీమిండియా క్రికెట్‌ కింగ్‌ కోహ్లీ ప్రవర్తన గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది. ఎందుకంటే మైదానం లోపల కోహ్లీ పలుసార్లు కంట్రోల్‌ తప్పిన మాట నిజమేనైనా మైదానం బయట మాత్రం కోహ్లీ మనసున్న మారాజు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి విరాట్‌ అడుగుపెట్టి ఇవాళ్టికి సరిగ్గా 15ఏళ్లు. ఈ 15ఏళ్ల కాలంలో కోహ్లీ తన ఫ్యాన్స్‌కి విలువ ఇవ్వని రోజు లేదు. ఆటోగ్రాఫ్‌ అడిగినా.. సెల్ఫీ అడిగినా.. తన పనిని ఆపి మరి ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయడం ఈ కింగ్‌కి అలవాటు. తాజాగా మరోసారి అదే చేశాడు.



సెల్ఫీతో ఫుల్‌ హ్యాపీ:

ఈ నెల చివరిలో ఆసియా కప్‌(Asia cup) ప్రారంభమవనుండగా ప్రస్తుతం సీనియర్‌ ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది రిలాక్స్‌గా ఇంట్లో కుర్చుంటే కోహ్లీ(Virat Kohli) మాత్రం ఈ హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. అలా ముంబై వీధుల్లో కనిపించిన కోహ్లీని చూసి ఫ్యాన్స్‌ తెగ ఆనందపడ్డారు. కోహ్లీని చూడగానే అతని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అది కుదరలేదు. దీంతో దూరం నుంచే కోహ్లీని తమ కెమెరాల్లో క్యాప్చర్‌ చేసే ప్రయత్నం చేశారు. మరికొందరు కోహ్లీతో సెల్ఫీ దిగేలాగా దూరం నుంచే మొబైల్‌ కెమెరాని అడ్జస్ట్ చేసుకునేందుకు ట్రై చేశారు. వారిలో ఒకరిని కోహ్లీ గమనించాడు. అతడి దగ్గరకు పిలిచాడు. సెల్ఫీ దిగాడు.. కోహ్లీ ఇలా చేస్తాడని ముందుగా ఊహించలేకపోయిన ఆ అభిమాని ఎంత ఆనందపడ్డాడో అతని ఎక్స్‌ప్రెషన్‌ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

15ఏళ్ల కెరీర్‌.. కింగ్‌ హోదా:

అంతర్జాతీయ క్రికెట్‌లోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తయింది. కోహ్లీ ఖాతాలో అనేక రికార్డులున్నాయి. వాటిలో కొన్నిటిపై ఓ లుక్కేయండి.

• అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడు కోహ్లీ. 100 సెంచరీలు చేసిన సచిన్ (Sachin Tendulkar) ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నాడు.

>అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 20 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను కలిగి ఉన్నాడు కోహ్లీ. ఇది టాప్‌.

• వన్డేల్లో అత్యంత వేగంగా 7,000, 8,000, 9,000, 10,000, 11,000, 12,000 పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అత్యంత వేగంగా 13,000 పరుగులు సాధించాలంటే కోహ్లీకి మరో 102 పరుగులు కావాలి.

> ఒకే దేశంపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు చేశాడు.

• అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు 4,008 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 4 వేల పరుగులు దాటిన ఏకైక బ్యాటర్ కోహ్లీ.

ఇలా కోహ్లీ ఖాతాలో లెక్కలేనని రికార్డులు ఉన్నాయి. సచిన్‌ రికార్డులు బద్దలు కొట్టడం సాధ్యం కాదని భావించిన కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ క్రికెట్‌ గాడ్‌ రికార్డులను బ్రేక్‌ చేయడమే కాకుండా.. సరికొత్త రికార్డులు సృష్టించాడు.

Also Read: నేడే ఐర్లాండ్‌తో భారత్ టీ20

#virat-kohli #virat-kohli-with-fans #virat-kohlis-heartwarming-gesture #virat-kohli-with-a-fan #virat-kohli-heartwarming-gesture-to-a-fan #virat-kohli-selfie #virat-kohli-fans #virat-kohli-heart-warming-gesture #virat-kohli-international-career #virat-kohli-records
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe