‘ఎంత క్యూట్‌గా ఉందో’.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఎవరి నోటా విన్నా ఇదే మాట వినిపిస్తోంది. క్లింకార పుట్టిన దగ్గరి నుంచి ఆమె ఫొటో కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి అదిరే ట్రీట్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. తాజాగా మెగా ప్రిన్సెస్ క్లింకార ఫొటోను షేర్ చేశారు ఉపాసన. క్లింకార జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫోటోను సోషల్ మీడియా ద్వార పంచుకున్నారామె. అమ్మమ్మ శోభా కామినేని, తాతయ్య అనిల్ కామినేనిలతో కలిసి పంద్రాగస్ట్ వేడుకల్లో పాల్గొంది క్లింకార. వారి ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో అమ్మమ్మ, తాతయ్యలు క్లింకారను ఎత్తుకొని జెండా ఎగురవేయించారు.
పూర్తిగా చదవండి..మెగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్.. ‘క్లింకార’ ఫస్ట్ లుక్..!
రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లింకారకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్లింకార ముఖం పూర్తిగా కనిపించకున్నా ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. తన చిట్టి చేతులతో మువ్వన్నెల జెండా తాడును పట్టుకున్న క్లింకార ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు ఉపాసన. గత జూన్ 20న మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది క్లింకార.
Translate this News: