Viplav Kumar: అందుకే మా నాన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.. కేకే కుమారుడు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో చేరాలన్న నా తండ్రి కేకే నిర్ణయం బాధ కలిగించిందని అన్నారు విప్లవ్ కుమార్. కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేశవరావు పార్టీ మారారని అన్నారు. పార్టీ మారడంపై కేశవరావు ఇప్పుడైనా పునరాలోచన చేసుకోవాలని కోరారు.

New Update
Viplav Kumar: అందుకే మా నాన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.. కేకే కుమారుడు సంచలన వ్యాఖ్యలు

Viplav Kumar: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కేకే కాంగ్రెస్ లో చేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కుమారుడు విప్లవ్‌ కుమార్‌. కాంగ్రెస్‌లో చేరాలన్న నా తండ్రి కేకే నిర్ణయం బాధ కలిగించిందని అన్నారు. గతంలో పొన్నాల గురించి రేవంత్‌ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు. 84 ఏళ్ల కేకేను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరమేంటీ? అని సీఎం రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు. కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేశవరావు పార్టీ మారారని అన్నారు. పార్టీ మారడంపై కేశవరావు ఇప్పుడైనా పునరాలోచన చేసుకోవాలని హితవు పలికారు.

రేపే కాంగ్రెస్ లోకి...

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కేశవరావు.. రేపు తన కూతురు మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 55 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తనుకు అనేక పదువులు ఇచ్చిందని గుర్తు చేశారు. నేను తెలంగాణ వాది. అక్కడే కాంగ్రెస్ తో విడిపోవాల్సి వచ్చింది. తెలంగాణ కోసం కేసీఆర్ (KCR) పోరాటం చేశారు. కానీ పార్లమెంట్ లో బిల్ కాంగ్రెస్ వల్లే పాస్ అయింది. ఎంతో పోరాడి కేసీఆర్ తెలంగాణ సాధించాడు. అయినప్పటికీ పార్టీ ఓడిపోయింది. కుటుంబపాలన అనే అంశం ప్రజలలోకి బలంగా వెళ్లింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇదొక బలమైన కారణం అని చెప్పారు.

నన్ను ఆపితే బాగుండు..

ఇక తనకు బీఆర్ఎస్ పార్టీ చాలా గౌరవం ఇచ్చిందని, అంతటి గౌరవాన్ని ఇంకెవరు ఇవ్వలేరన్నారు. అలాగే బాల్క సుమన్ , శ్రీనివాస్ యాదవ్ వీళ్లది పెద్ద కమ్యూనిటీ కాబట్టి వీళ్లను ముందు పెట్టి పార్టీ నడిపితే బాగుండేది. ఇక ‘నేను ఘర్ వాపస్ పోవాలి అని డిసైడ్ అయ్యాను. నన్ను ఆపితే బాగుండు అని కేసీఆర్ అనుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం శాశ్వతంగా ఉంటుంది. ఇండియా కూటమి చీలి పోలేదు. నా కూతురు కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది’ అని కేశవరావు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు