సచిన్ అంతకు ముందు లెజండరీ క్రికెటర్ల వీడియోలు చూడాలంటే ఇంతకు ముందు వరకు మనకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్. అప్పటి ఆటగాళ్ళ స్పెషల్ రికార్డులు, బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ దొరికే ఒకే ఒక్క చోటు ఈ యూట్యూబ్ ఛానెల్. క్రికెట్ గురించి తెలుసుకోవాలన్నా, రిఫరెన్స్ లు కావాలన్నా వెతికే ఛానెల్ రాబ్ లిండా యూట్యూబ్. 14 ఏళ్ళ నుంచీ నడుపుతున్న ీ ఛానెల్ ఇక మీదట మనకు దొరకదు. ఎందుకంటే దీన్ని శాశ్వతంగా మూసేస్తున్నారు. రాబ్ లిండ్ యూట్యూబ్ ఛానెల్ ను అఫీషియల్ గా టెర్మినేట్ చేసేస్తున్నామని దాని ఓనర్ రాబ్ మూడీ ప్రకటించారు. 14 ఏళ్ళుగా తనను ఆదరించినందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతున్నారు.
కాపీ రైట్స్ ఇష్యూ వల్లనే రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ను మూసేస్తున్నారు. బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ లు రాబ్ లిండా ఛానెల్ మీద స్ట్రైక్ చేశాయి. తమ ఆధీనంలో ఉండవలసిన, తమకు మాత్రమే హక్కు ఉన్న వీడియోలను రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ దగ్గర ఉన్నాయని...దీని వల్ల తమకు నష్టమని చెబుతున్నాయి. అమ్మ పెట్టాపెట్టదు...ఇంకేదో చెయ్యనివ్వదు అన్నట్టు...బ్రాడ్ కాస్ట్ సిస్టమ్స్ తమ దగ్గర ఉన్న వీడియోలను బయటపెట్టవు. కనీసం రాబ్ లిండా లాంటి యూట్యూబ్ ఛానెల్స్ ను కూడా ఉండనివ్వడం లేదు. పాత క్రికెటర్ల రికార్డ్ ప్లే, ఇన్నింగ్స్ లు అంత ఈజీగా ఎక్కడ పెడితే అక్కడ దొరకవు. అవన్నీ పలు బ్రాడ్ కాస్ట్ ల చేతుల్లో ఉంటాయి. అయితే అలాంటివాటినన్నిటినీ రాబ్ లిండా ఇన్నాళ్ళు తన ఛానెల్ లో బద్రంగా దాచారరు. అందరికీ అందుబాటులో ఉంచారు. ఇప్పుడు దీన్ని అఫీషియల్ గా మూసేయడం వల్ల మొత్తానికి అవన్నీ దొరక్కుండా పోతున్నాయి.
రాబ్ లిండా కొన్ని రోజులుగా థ్రెట్ ఎదుర్కొంటోంది. ఈ ఛానెల్ ను ఆపేయకపోతే యాక్షన్స్ తీసుకుంటామని బెదిరిస్తున్నాయి. కాపీ రైట్స్ ఉందని, ఛానెల్ ను శాశ్వతంగా టెర్మినేట్ చేయాలని చెబుతున్నాయి. వరుసపెట్టి ిలాంటివి రావడంతో ఈ ఛానెల్ ఓనర్ రాబ్ మూడీ దీన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యారు. దీని వలన రాబ్ కు పెద్దగా నష్టం లేకపోవచ్చును. క్రికెట్ లవర్స్ కు మాత్రం ఇది చాలా బాధపెట్టే విషయమే. తమకు నచ్చిన క్రికెటర్ల్ వీడియోలు ఎప్పటికప్పుడు హాయిగా చూసుకునేవారు ఇన్నాళ్ళు. ఇక మీదట అది దొరకదు. దీంతో రాబ్ లిండా యూట్యూబ్ ఫ్యాన్స్ అందరూ బాగా హర్ట్ అవుతున్నారు.