Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కేసు మళ్ళీ వాయిదా..ఆగస్టు 16న తీర్పు

వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు మీద తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఈరోజు సీఏఎస్ తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా దీనిని ఆగస్టు 16కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. దీంతో వినేశ్‌కు పతకం వస్తుందా లేదా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కేసు మళ్ళీ వాయిదా..ఆగస్టు 16న తీర్పు
New Update

ఇవాల్టితో తీర్పు వచ్చేస్తుంది. పతకం వస్తుందా రాదా అనే సస్పెన్స్ తొలిగిపోతుంది అనుకున్నారంతా. వినేశ్ ఫోగాట్ కూడా ఇదే ఆశతో ఇంకా పారిస్‌లోనే ఉంది. ఒలింపిక్స్ విలేజ్ నుంచి బయటకు వచ్చేసినా పారిస్‌లోనే ఉంది. కానీ ఈ కేసులో తీర్పును సీఏఎస్ మళ్ళీ వాయిదా వేసింది. ఆగస్టు 16, సాయంత్రం ఆరు గంటలకు తుది తీర్పును వెలువరిస్తామని చెప్పింది. దీంతో వినేశ్ పతక ఆశల మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నట్టు అయింది.

100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్‌ ఫైనల్ ఫైట్‌కు దూరమైన వినేశ్ ఫోగాట్.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు పతకం (Silver Medal) ఇవ్వాలంటూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. దీంతో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చేసిన విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం దీని మీద విచారణ చేపట్టింది. 

సెమీస్ లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేసింది. వినేష్‌ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆ పతకం వినేష్‌ కు మాత్రమే చెందాలని వాదించారు. విచారణ తర్వాత సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం, లాయర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సీఏఎస్ మాత్రం ఈ కేసులో ఇవ్వాల్సిన తీర్పును వాయిదాల మీద వాయిదాలను వేస్తోంది. ఆగస్టు 8న ఇవ్వాల్సిన తీర్పును ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేసింది. 11, 13, ఇప్పుడు మళ్ళా ఆగస్టు 16కు తీర్పు వాయిదా పడింది.

సాధారణంగా కాస్ ఇలాంటి విషయాల్లో 24గంటల్లోనే తీర్పు ఇచ్చేస్తుంది. కానీ వినేశ్ కేసులో ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేశారు. దీని బట్టి ఈ కేసు విషయంలో ప్యానెల్ తీవ్రంగా ఆలోచిస్తోందని అర్ధమైంది అంటున్నారు వినేశ్ కేసును వాదించిన విదుష్పత్ సింఘానియా. ఇక్కడ తాను చాలా కేసులు వాదించానని...సక్సెస్ రేట్ తక్కువ అని చెబుతున్నారు . వినేశ్ కేసులో చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాము. ఇది కొంచెం కష్టమే అయినా అద్భుతం జరగాలని ఆశిద్దాం అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మెడల్ రాకపోయినా వినేశ్ ఛాంపియనే అన్నారు సింఘానియా.

Also Read:  NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు

#cas #vinesh-phogat #final-verdict
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe