Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఫొగాట్.. ఈవెంట్‌కు ముందు బరువు కొలవగా కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినా ఫలితం చేజారిపోయింది. జరిగిన దానిని వినేశ్ చాలా ధైర్యం తీసుకుంది. ఇదంతా ఆటలో భాగం అని…దానికి ఎవరు ఏం చేస్తారు అంటూ మిగతా ఆటగాళ్ళకు, కోచ్‌లకు చెప్పింది. నవ్వుతూ తనను తాను, మిగతా వారిని ఓదార్చింది. దాంతో పాటూ తర్వాత వేయాల్సిన కరెక్ట్ స్టెప్‌ను వేసింది.
తనకు జరిగిన అన్యాయం మీద కోర్టుకు వెళ్ళింది. అనర్హత వేటు మీద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో రిపోర్ట్ చేసింది. సెమీస్‌లో గెలిచిన తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అందులో కోరింది. దీనికి సంబంధించి సీఏఎస్ ఆగస్టు 8న అంటే రేపు తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ సీఏఎస్ రూల్స్ వినేశ్‌కు అనుకూలంగా వస్తే మరో పతకం భారత్ ఖాతాలో పడుతుంది.
ఈ ఆర్బిట్రేషన్ కోర్టును 1984లో ఏర్పాటు చేశారు. ఇందులో ఒలింపిక్స్‌లో మాత్రమే కాదు మొత్తం క్రీడల్లో వివాదాలను పరిష్కరిస్తారు.
Also Read:Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌కు క్రీడాకారుల మద్దతు