పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమె కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ అయిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫొగాట్, గంజ్‌మెన్ లోపెజ్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డారు. ఇందులో ఫొగాట్ చేతిలో లోపెజ్ ఓటమి పాలయ్యింది. ఏకంగా 5-0 పాయింట్ల తేడాతో ఫొగాట్.. ఆమెను చిత్తుచేసింది.
Also Read: వెంటపడి వేధించిన కామాంధులు.. తప్పించుకునేందుకు 140 కి.మీ.లు ప్రయాణించిన బాలికలు!
చివరికి ఫైనల్‌కు చేరిన ఫొగాట్.. కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో డిస్‌క్వాలిఫై అయ్యింది. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లో ఆర్టికల్ 11 ప్రకారం.. సెమీ ఫైనల్స్‌లో ఫొగాట్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ లోపెజ్‌కు ఫైనల్స్‌లో ఆడే అవకాశం దక్కింది. దీంతో భారత్ బంగారు పతకాన్ని చేజిక్కుంచుకునే అవకాశాన్ని కోల్పోయింది. మరో విషయం ఏంటంటే బరువును కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ఫొగాట్ చాలా వర్కవుట్ చేసింది. అయినప్పటికీ ప్రతికూల ఫలితం ఎదురయ్యింది. దీంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది.
Also Read: విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఒకరిపై ఒకరు కాల్పులు!