Odisha : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు కాల్పులు (Police Firing) జరుపుకుని మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ మేరకు సోన్పూర్ జిల్లా బినిక ఠాణా పరిధిలోని చులిమాల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గొడవపడది మంగళవారం రాత్రి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో వారిద్దరూ అక్కడికక్కడే మరణించగా.. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వారిని మనూ జింకా, సహదేవ్ జింకాలుగా గుర్తించారు. అయితే వీరిద్దరూ బంధువులేనని తేలడంతో కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Police Firing : విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఒకరిపై ఒకరు కాల్పులు!
ఒడిశాలోని సోన్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మనూ జింకా, సహదేవ్ జింకా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని అక్కడిక్కడే చనిపోయారు. వీరిద్దరూ బంధువులేనని తేలడంతో కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Translate this News: