Ap Elections: విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో దాదాపు రెండు గంటలుగా పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీవో రాంబాబు ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన స్థానికులు..అతడిపై దాడికి దిగారు.
వృద్దులను ప్రభావితం చేసి వారి ఓట్లను టీడీపీ కి పడేటట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని గుర్తించిన గ్రామస్థులు..పీవోను ప్రశ్నించగా ఆయన కూడా ఆ వ్యక్తులకే వత్తాసు పలకడంతో గ్రామస్తులు ఆయన పై దాడికి దిగారు. దీంతో పీవో రాంబాబుని గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పీవోను విచారణ నిమిత్తం సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో.. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ. పలు ప్రాంతాల్లో ఘర్షణలు, దాడులు జరగగా.. అవి మినహా.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Also read: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్!