దహనసంస్కారాలకు దారి లేక! తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది. By Bhavana 26 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో బాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం మరణించాడు. కానీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామంలోని వాగు ఉప్పొంగుతోంది. చనిపోయిన వ్యక్తికి దహనసంస్కారాలు చేయాలంటే ఆ వాగు దాటి ఆవతలికి వెళ్లాల్సిందే. తప్పని సరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాడె మోసుకుంటూ వాగు దాటారు. ఇప్పటికే ఈ గ్రామానికి వంతెన నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా మా కష్టాలు చూసైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వాధికారులు తమ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు. #telangana #siddipet #floods #cremation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి