Telangana: గుప్త నిధుల కోసం ఇంత దారుణమా? ఏకంగా దేవుడి విగ్రహాన్నే..

రంగారెడ్డి జిల్లా భీమారం గ్రామంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. గుప్త నిధుల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పురాతన విగ్రహం తొలగించి ముక్కలు ముక్కలుగా చేశారు. ఇది గుర్తించిన గ్రామస్తులు.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Telangana: గుప్త నిధుల కోసం ఇంత దారుణమా? ఏకంగా దేవుడి విగ్రహాన్నే..

Rangareddy District News: రంగారెడ్డి జిల్లాలో ఫరూక్ నగర్‌ మండలం భీమారం(Bhimaram) గ్రామంలో గుప్త నిధుల కలకలం సృష్టించింది. ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పురాతన విగ్రహం తొలగించి ముక్కలు ముక్కలుగా చేశారు దుర్మార్గులు. దాంతో భీమారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో ఒంటి వీరన్న పురాతన విగ్రము ఉంది. గ్రామస్తులు ఎన్నో ఏళ్ల నుండి భక్తిశ్రద్ధలతో వీరన్నకు పూజలు చేస్తూ వస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని గుప్త నిధుల కోసం కొందరు కేటుగాళ్లు తొలగించారు. తొలగించడంమే కాకుండా విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు.

అర్థరాత్రి వేళ ఈ దారుణానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఉదయాన్నే దేవుడికి పూజలు చేసేందుకు వచ్చిన గ్రామస్తులు.. ముక్కలైన విగ్రహాన్ని చూశారు. దాంతో విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గుప్త నిధుల కోసమే విగ్రహాన్ని ధ్వంసం చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఎంతో భక్తి వ్రద్ధలతో పూజించే ఒంటి వీరన్న విగ్రహాన్ని తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజలు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్..

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

Advertisment
తాజా కథనాలు