Watch Video : అదృష్టమంటే అక్కదే.. రైలు కిందపడినా సేఫ్‌!

వికారాబాద్ జిల్లా నవాంద్గి రైల్వే స్టేషన్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. టాకీ తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ రావడంతో పట్టాలమధ్య పడుకుంది. ఊపిరి బిగపట్టి ట్రైన్ వెళ్లిపోయేవరకూ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Watch Video : అదృష్టమంటే అక్కదే.. రైలు కిందపడినా సేఫ్‌!

Vikarabad: ఓ మహిళ రైలుకిందపడి అదృష్ణవశాత్తు బతికి బయటపడింది. పట్టాలు దాటుతుండగా అనుకోకుండా రైలు రావడంతో అలాగే పట్టాలమధ్య పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు ఉలిక్కిపడుతున్నారు. అదృష్టమంటే అక్కదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి రైల్వే స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఈ మేరకు టాకీ తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు అటుగా వచ్చింది. వెంటనే రైలు పట్టాల మద్య పడుకుంది. వెంటనే అక్కడున్న వారు ఆమెను అలర్ట్ చేయడంతో ఊపిరి భిగబట్టి పట్టాల మధ్య కదలకుండా పడుకుంది. రైలు మీద నుంచి పూర్తిగా వేళ్లేంత వరకు కదలలేదు. రైలు వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్న ఆమె.. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనైంది.

Advertisment
తాజా కథనాలు