Vijayawada: రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Vijayawada: రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
New Update

పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

విచక్షనరహితంగా చితకబాది

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవటంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల క్రితం కాబేలా ప్రాంతానికి చెందిన పిళ్ళా కీర్తిక్ ఊర్మిళనగర్ చెందిన కొంతమంది యువకుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఒక ఫాంట్ కోసం రెండు వర్గాల మధ్య గొడవ పడుతున్నారు. పిళ్ళా కార్తీక్‌ను విచక్షనరహితంగా చితకబాది దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమవుతది.. చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో అనే పాటను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఊర్మిళా నగర్‌కు చెందిన యువకులు. దాడి చేసిన వారిపై ప్రతి దాడికి ప్రత్నించారు పిళ్ళా కార్తీక్‌. బండి తాళాలతో రెండు వర్గాల యువకులు దాడులు చేసుకున్నారు. అయితే రెండు వర్గాలకు చెందిన యువకులు పరారిలో ఉన్నారు.

This browser does not support the video element.

భయాందోళనకు గురైన స్థానికులు

ఈ ఘటనలో సుమారు పది మంది యువకులు ఒక అబ్బాయిని తీవ్రంగా తన్నుతూ, గుద్దుతూ దాడి చేశారు. పక్కనే ఉన్న స్థానికులు సినిమా చూసినట్టు చూసారే తప్పా.. గొడవలు ఆపేందుకు ప్రయత్నించారు. పదిమంది యువకులు వచ్చి అల్లరి చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల వాళ్ళ కొంత మంది వచ్చి గొడను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ యువకుడి తీవ్రంగా కొట్టడంతో సృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న స్థానికులు గాయపడిన యువకుడిని పక్కను తీసుకోవెళ్లాడు. ఆగ్రహంతో ఉన్న యువవలకు ఆపే ప్రయత్నం చేశారు. రెండు వర్గాల మధ్య యుద్ధ ఘర్షనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు.

This browser does not support the video element.

పట్టించుకోకపోవడం బాధాకరమని

ఊర్మిళ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘర్షణపై ఇక పోలీస్ అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి. యువకుల దాడితో భయభ్రాంతులకు గురైన స్థానికులకు ఎలాంటి సెక్యూరిటీ కలిపిస్తారో చూడాలి. ఇంత జరుగుతున్నా వైసీపీ అధికారులు, నాయకులు దీనిని పట్టించుకోకపోవడం బాధాకరమని స్థానికులు చెబుతున్నారు.

This browser does not support the video element.

#vijayawada #ntr-district #pilla-keertik #urmilanagar #war-atmosphere-between-two-groups
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి