vijayawada: జగన్ పెద్ద గజ దొంగ..వైసీపీని క్లోజ్ చేయడం పక్కా: బుద్ధా వెంకన్న చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడలో మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. నిన్న జగన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పెద్ద గజ దొంగ... 42వేల కోట్లు ఈడీ జప్తు చేసిందన్నారు. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. By Vijaya Nimma 17 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ప్రజలకు ఆ ఆలోచన లేదు చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడలో మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. నిన్న జగన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పెద్ద గజ దొంగ... 42వేల కోట్లు జప్తు చేసిందన్నారు. చార్లెస్ శోభరాజ్ లాగా జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్లు గాంధీజీని పెట్టినట్లు చంద్రబాబును పెట్టారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబును జైల్లో వేసి దొంగను చేశానని జగన్ సంకలు గుద్దుకుంటున్నాడు. కానీ ప్రజలు ఎవరూ చంద్రబాబును దొంగలా భావించడం లేదన్నారు. జగన్‌ను మాత్రం అవినీతి పరుడిగానే ప్రజలు గుర్తించారని బుద్దా వెంకన్న అన్నారు. చార్లెస్ చోప్రాలా జగన్‌ను జైల్లో పెడితే నీ అవినీతిలో వాటాదారులే అతన్ని కలిశారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయ నాయకులు కూడా స్పందించారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ములాఖత్ కు వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. మిలాఖత్ అనే వైసీపీ నాయకులుకు సిగ్గు శరం ఉందా.? అని ప్రశ్నించారు. జగన్ దొంగ కాబట్టే దేశంలోనే అతి పెద్ద అవినీతి పరుడి పార్టీలో మీరంతా ఉన్నారని ఎద్దేవా చేశారు. జైల్లో చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కూడా ములాఖాత్ అవకాశం ఇవ్వలేదు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా..? అన్నారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి కెమెరా పెట్టి చూస్తూ జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును అందరూ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే... అవినీతి పరుడు జైలుకు వెళ్లాడనే అన్నారు. రిమాండ్ రిపోర్ట్ చూసిన ఎవరైనా చంద్రబాబుపై ఆధారాలు లేవనే అర్ధమవుతుందన్నారు. జగన్ లాగా బాంబులు చుట్టిన నేపథ్యం చంద్రబాబుకు లేదన్నారు. హత్య, కుట్రలు, అవినీతి నేపథ్యం మొత్తం నీ కుటుంబం వైపే ఉన్నాయి అని ఆరోపించారు. జగన్ దొంగ కాబట్టే... అందరిని దొంగ దొంగ అని అరుస్తున్నాడు. ఎన్నికల వరకు పని చేయించుకుని సొంత తల్లి, చెల్లినే గెంటేసిన చరిత్ర నీది అన్నారు. కుటుంబ విలువలు తెలియని ఏకైక వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వైసీపీ చాప్టర్ క్లోజ్ సొంత బాబాయినే హత్య చేయించి, ఆమె కుమార్తెపై నీచపు రాతలు రాయించావు. జగన్‌కు అధికారం, డబ్బు తప్ప.. బంధాలు అవసరం లేదు. చంద్రబాబు, అతని కుటుంబం ఒక వైట్ పేపర్. నువ్వు ఎలాంటి నిందలు వేసినా, అవి గాలి కబుర్లు. ఇప్పుడు మళ్లీ లోకేష్‌ను అరెస్టు చేస్తాం అంటున్నారు. రేపు భువనేశ్వరి, బ్రాహ్మణిని కూడా అరెస్టు చేస్తారేమో..? చంద్రబాబుకు పవన్ కళ్యాణ్‌తోడు అయ్యాడని జగన్ భయ పడుతున్నారు. 175 స్తానాల్లో వైసీపీకి ఇప్పుడు అభ్యర్థులు లేరు. నువ్వు ఇచ్చే డబ్బులు నీ అభ్యర్థులు ఇళ్లల్లో దాచుకుంటారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఓటమి ఖాయం అని దీమం వ్యక్తం చేశారు. జగన్ ఇంటికి వెళ్తారు...వైసీపీని క్లోజ్ చేయడం పక్కా అన్నారు. వెల్లంపల్లి ఒక రాజకీయ నాయకుడా.?. ఇది పెద్ద కామెడీ. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడో...అతని ఎజెండా ఏమిటో అతనికే తెలియదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు మాకు సుప్రీం... జనసేన, టీడీపీ కలిసి పని చేస్తాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. #chandrababu #jagan #tdp-leader-buddha-venkanna #big-thief #ycp-closed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి