Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!

ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

New Update
Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!

Prakasham barriage: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు మరోసారి వరద భారీగా పెరుగుతోంది. పైనుంచి వరద ప్రవాహం పెరుగుతుండడంతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానికులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటి వరకు బ్యారేజ్‌ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4 లక్షల 50 వేల 442 క్యూసెక్కులుండగా.. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుడమేరుకు ప్రవాహం మరింత పెరిగింది. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు..
ఇదిలా ఉంటే.. ఏపీలో రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్‌ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్‌ ఉంది. విశాఖ,అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

Advertisment
తాజా కథనాలు