విజయవాడ మల్టీప్లెక్స్‌ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌!

విజయవాడ లోని ఎల్ఈపీఐ మల్టీప్లెక్స్ లో కుళ్లుతున్న సమోసాలను అమ్ముతున్నారని ఓ మహిళ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్‌ గా మారింది.

విజయవాడ మల్టీప్లెక్స్‌ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌!
New Update

విజయవాడలోని(Vijayawada) ఎల్‌ఈ పీఐ (LEPI) మల్లీప్లెక్స్‌ (Multiplex) లో కుళ్లిన సమోసాలు అమ్ముతున్న సంఘటన బయటకు వచ్చింది. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి మల్టీప్లెక్స్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. విరామం సమయంలో తినడానికి సమోసాలు, కూల్‌ డ్రింక్‌ తీసుకున్నారు. వాటిని తినే సమయంలో కుళ్లిన వాసన రావడంతో ఆమె వాటిని తెరిచి చూశారు.

అవి లోపల బూజు పట్టి ఉన్నాయి. దీంతో ఆమె అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. కానీ వారు సమోసాలను బయట నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు.బయట 20 రూపాయలకు కొని మాల్ లో 130 రూపాయలకు అమ్ముతున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. ఫుడ్‌ స్టాల్ నిర్వాహకులు, మల్టీప్లెక్స్‌ మేనేజర్‌ ని అడిగినా ఎటువంటి సమాధానం లేదు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న షిఫ్ట్‌ ఇన్‌ ఛార్జ్‌ బాధితులతో తరువాత మాట్లాడతామని, లోపల మాట్లాడతామని వారిని రావాల్సిందిగా కోరారు. అయితే ఆమె ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడాలని చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమె జరిగిన తతాంగాన్ని అంతటిని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌ గా మారింది.

ఈ క్రమంలో ఆమె ద్విచక్ర వాహనం తాళాలు , ఇంటి తాళాలు ఎక్కడో జారి పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు బాధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ తిరిగి మల్టీప్లెక్స్‌ కి వెళ్లగా అక్కడి సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో బాధితులు మల్టీప్లెక్స్‌ ముందు వాగ్వాదానికి దిగారు.

ఈ విషయం గురించి మల్టీప్లెక్స్‌ మేనేజ్‌ మెంట్‌ ని వివరణ కోరగా...'' సోమవారం సాయంత్రం మహిళ సమోసాలు కొన్నారు. రుచి బాగాలేదని తెలిపారు.వాటిని మళ్లీ మార్చి ఇస్తామని లేదంటే వారి డబ్బులను అయినా వెనక్కి ఇస్తామని చెప్పాం. కానీ వారు మా సిబ్బందిని తిడుతూ నానా హంగామా చేస్తూ వెళ్లిపోయారని తెలిపారు.

Also read: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

కొద్ది సేపటి తరువాత వాళ్లు మళ్లీ వచ్చి వారి ఇంటి తాళాలు, బండి తాళాలు మేము తీసినట్లు సోషల్‌ మీడియాలో లైవ్‌ పెట్టారు. ఆమె వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడుతుండడంతో పోలీసులకు తెలిపినట్లు మేనేజ్‌మెంట్‌ వివరణ ఇచ్చింది. పోలీసులు వచ్చిన తరువాత వారి సమక్షంలోనే థియేటర్‌ మొత్తం తాళాలు కోసం వెదికాము అయినా అవి దొరకలేదు అని పేర్కొన్నారు.

మహిళ వీడియో తీస్తూ థియేటర్‌ లోని వారిని ఇబ్బంది పెడుతున్నట్లు మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పగా వారు ఆమెను స్టేషన్‌ కు వచ్చి ఫిర్యాదు చేయమని కోరగా..స్టేషన్‌ వరకు వచ్చిన ఆమె మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

#vijayawada #andhrapradesh #lepi-multiplex #samosa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe