Kesineni Nani: టీడీపీకి మరో షాక్..ఎన్నికల వేళ టీడీపీకి కేశినేని నాని గుడ్ బై?

కేశినేని నాని ఫిబ్రవరి తొలి వారంలో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత కార్యాచరణ పై నాని ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు.

New Update
BIG BREAKING: తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా!

ఎన్నికలు (Elections)  సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు (AP politics) వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనవరి 7 న తిరువూరులో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల సమయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరి వర్గీయులు మధ్య పెద్ద యుద్దమే జరిగింది.

ఈ క్రమంలోనే నాని కలగజేసుకుని పదవులు లేని వ్యక్తులు పెత్తనాలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ..గట్టిగానే వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అయితే కేశినేని నాని ఫిబ్రవరి తొలి వారంలో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఆయన కార్యాచరణ పై నాని ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ఇక మీదట టీడీపీలో ఉండలేను అంటూ నాని ఇప్పటికే పార్టీ పెద్దలకు తెలిపారు. ఇదిలా ఉంటే నాని విజయవాడ పార్లమెంట్‌ లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఈసారి విజయవాడ ఎంపీ సీటు వేరేవారికి ఇచ్చి నానికి షాక్‌ ఇచ్చింది టీడీపీ. ఈ విషయం గురించి నాని శుక్రవారం ఉదయం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని, ఈసారి విజయవాడ టికెట్ వేరే వారికి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దన్నరని చెప్పారు. ఆయన ఆఙ్ఙలను తూచా తప్పకుండా పాటిస్తానని వివరించారు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా అని హాట్ కామెంట్స్ చేశారు. తినబోతూ రుచులెందుకు అని వ్యాఖ్యానించారు.

Also read:హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బందిని కాపాడిన నావికాదళం!

Advertisment
Advertisment
తాజా కథనాలు