Kesineni Nani: ఆ 5 టికెట్లు ఇవ్వాల్సిందే.. జగన్ కు కేశినేని నాని పెట్టిన డిమాండ్లు ఇవే?

టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రోజు తన కుమార్తె శ్వేతతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే.. ఒక ఎంపీ టికెట్ తో పాటు, నాలుగు ఎమ్మెల్యే టికెట్లను తాను సూచించిన వారికి ఇవ్వాలని జగన్ ను ఆయన కోరినట్లు తెలుస్తోంది.

New Update
Kesineni Nani: ఆ 5 టికెట్లు ఇవ్వాల్సిందే.. జగన్ కు కేశినేని నాని పెట్టిన డిమాండ్లు ఇవే?

విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీడీపీకి (TDP) రాజీనామా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తో (CM jagan) ఈ రోజు భేటీ అయ్యారు కేశినేని నాని. నానితో పాటు జగన్‌ను (Jagan) ఆయన కుమార్తె శ్వేత కూడా కలిశారు. ఎంపీ పదవికి ముందుగా రాజీనామా చేసి.. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకోవాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే తన కార్పొరేటర్‌ పదవికి, టీడీపీకి నాని కుమార్తె శ్వేత రాజీనామా చేశారు. ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్లను నాని వైసీపీని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నానికి సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జగన్‌తో భేటీకి ముందు నానిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాష్‌ తదితరులు కలిసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BREAKING : సీఎం జగన్‌కు షాక్.. మరో నేత రాజీనామా!

జగన్ తో భేటీ తర్వాత కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీ తనను అనేక సార్లు అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో టీడీపీ చిచ్చుపెట్టిందన్నారు. చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. తనను చెప్పితీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ పట్టించుకోలేదన్నారు. సీఎం కార్యక్రమాలకు తనను హాజరుకాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపించారు. సొంత వ్యాపారాల కన్నా పార్టీ ముఖ్యమని భావించి పని చేశానన్నారు.
ఇది కూడా చదవండి: Buddha Venkanna: కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క.. రేబీస్ ఇంజెక్షన్లు చేయండి: బుద్ధ వెంకన్న

పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానన్నారు. వ్యాపారాలను కూడా వదులుకున్నానన్నారు. తాను మొత్తం రూ.2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానన్నారు. తన ఎంపీ రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతానన్నారు. విజయవాడ ఓ రియాలిటీ.. అమరావతి ఓ కల అని అన్నారు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసున్నారు.

కానీ ఇంత పచ్చిమోసగాడు.. దగా చేస్తాడని తనకు ఇప్పుడే తెలిసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలతో విజయవాడ ఎంపీగా కేశినేని నానిని వైసీపీ బరిలోకి దించడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీ కేశనేని చిన్నిని పోటీ చేయించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ సారి విజయవాడ ఎంపీ ఎన్నిక రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు