ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. పాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లిన సిబ్బంది ఏం చేసిందో తెలుసా?

పసిపాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చిన దారుణమైన ఘటన విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన పాప కాలుకు కట్టిన ట్యాగ్ పై అబ్బాయి అని రాసి ఉండటంతో అసలు విషయం బటయపడింది. తన పసిగుడ్డును అప్పగించాలంటూ తల్లి బోరున ఏడ్చింది.

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. పాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లిన సిబ్బంది ఏం చేసిందో తెలుసా?
New Update

పసిపాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చిన దారుణమైన ఘటన విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన పాప కాలుకు కట్టిన ట్యాగ్ పై అబ్బాయి అని రాసి ఉండటంతో అసలు విషయం బటయపడింది. దీంతో తన పసిగుడ్డును అప్పగించాలంటూ తల్లి బోరున ఏడ్చింది.

వివరాల్లోకి వెళితే.. నవంబర్ 8న కంకిపాడు నుంచి డెలివరీ కోసం గంగా భవాని అనే మహిళ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలోనే అడ్మిట్ అయిన రోజే ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఒక బిడ్డకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఐసీయూలో ఉంచారు. మరో బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని తల్లి దగ్గరే పడుకోబెట్టారు. అయితే బిడ్డ పుట్టిన మొదటిరోజే పాటు పట్టించాలని చెప్పి ఆ పసిగుడ్డును తల్లి దగ్గరనుంచి ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లింది. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. కాసేపటికే అసలు డ్రామా మొదలైంది. గంటల వ్యవధిలోనే బేబీ చనిపోయాయిందంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Also read:నగ్నంగా కట్టేసి, కారంపొడి పోసి.. కూతురును ప్రేమించాడనే కోపంతో యువకుడిని చంపిన పేరెంట్స్

ఈ విషయం తెలియగానే బోరున ఏడ్చిన పాప తల్లితండ్రులు కాసేపటికి మృతి చెందిన బేబీ కాలును పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బేబీకి రెండు ట్యాగ్స్ ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పుట్టింది అమ్మాయి అయిన్నపుడు చనిపోయిన పాప బాడీకి అబ్బాయి ట్యాగ్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తమ పాప వద్ద కూడా సిబ్బంది ఫింగర్ ప్రింట్ తీసుకోలేదని, కానీ చనిపోయిన బేబికి ఫింగర్ ప్రింట్ తీసుకున్నట్టు ఆనవాళ్లున్నాయని గుర్తించి గొడవకు దిగారు. చనిపోయిన బేబి తమ బిడ్డ కాదని వాదించారు. హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డను అప్పగించాలంటూ కన్నీరుమున్నీయ్యారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

#vijayawada #government-hospital #horrible-incident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe