Malladi Vishnu: విజయవాడ సెంట్రల్ వైసీపీ లో సమసిన అసంతృప్తి

విజయవాడ సెంట్రల్ వైసీపీ లో ఉన్న అసంతృప్తి వాతావారణం సమసిపోయింది. సెంట్రల్ లో టికెట్ విషయంలో నెలకొన్న అనిశ్చితి వాతావారణం కారణంగా మల్లాది వర్సెస్ వెలంపల్లి గా మారిన క్రమంలో వెలంపల్లి కార్యాలయ ప్రారంభోత్సవానికి మల్లాది హాజరయి వెలంపల్లి గెలుపుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Malladi Vishnu: విజయవాడ సెంట్రల్ వైసీపీ లో సమసిన అసంతృప్తి
New Update
Vijayawada Central YCP Mlas: గత కొన్ని రోజులుగా విజయవాడ సెంట్రల్ వైసీపీ లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే.  విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజక వర్గం నుంచి మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో వెలంపల్లి టికెట్ కన్ఫర్మ్ అవడంతో మల్లాది విష్ణు వెలంపల్లి మధ్య గ్యాప్ మరీ ఎక్కువ వవుతుందని అందరూ భావించారు . కానీ ఊహించని విధంగా  వెలంపల్లికి సహకరించాలని మల్లాది విష్ణు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లో అసంతృప్తి సెగలు  సమసిపోయాయి.

ఆత్మయ ఆలింగనం చేసుకున్న మల్లాది , వెలంపల్లి
ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు  కార్యాలయాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు హాజరయి వెలంపల్లికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.అనంతరం మల్లాది మాట్లాడుతూ .. వెల్లంపల్లితో కలిసి పని చేసే అంశం పై సజ్జల సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే మొదటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమేనని , వెల్లంపల్లి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెల్లంపల్లిని ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత.. మొదటిసారి ఆయన గెలుపు కోసం కృషి చేయాలని  మల్లాది విష్ణు మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
విష్ణు అన్ననాయకత్వంలో ముందుకెళదాం - వెలంపల్లి 
అనంతరం సెంట్రల్ ఇంచర్జ్ వెలంపల్లి మాట్లాడుతూ .. అతి తక్కువ సమయంలో  కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా  సంతోషంగా ఉందని , ఈ రోజు నుంచి విజయవాడ సెంట్రల్ లో ఎన్నికల సమర శంఖం మొదలవుతుందని , నాయకులు,  కార్యకర్తలు సహకరించాలని కోరారు. అందరం విష్ణు అన్న,  ఎంపి కేశినేని నాని నాయకత్వంలో ముందుకు వెళ్లి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జండా ఎగరవేద్దామని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణుతో పాటు ,ఎంపి కేశినేని నాని,ఎమ్మెల్సీ రుహుల్లా,సమన్వయకర్తలు దేవినేని అవినాష్,షేక్ అసిఫ్,స్వామి దాసు,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి,బెల్లం దుర్గా,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు,పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,నాయకులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#ycp #ap-politics #vijayawada-central #velampalli-srinivasa-rao #malladhi-vishnu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe