Bonda Uma: హిందూవులపై దాడి చేస్తే ఊరుకోం.. వైసీపీకి బోండా ఉమా హెచ్చరిక
సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధర్మం అంటే గౌరవం లేదని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని.. ప్రజల డేటాను విదేశాలకు అమ్ముకోవాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో హిందూ ధర్మం నియమాలు పాటించకుండా ఉన్నారని దుయ్యబట్టారు.