Vijayawada Bus accident: మానవ తప్పిదం వల్లే విజయవాడ బస్సు ప్రమాదం!

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్‌ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.

Vijayawada Bus accident: మానవ తప్పిదం వల్లే విజయవాడ బస్సు ప్రమాదం!
New Update

విజయవాడ (Vijayawada) ఆర్టీసీ బస్టాండ్‌ (Rtc Bus stand) లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ కు సరైన శిక్షణ లేకపోవడం వల్లే బస్సు ప్లాట్‌ ఫాం పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు వివరించారు. బస్సు ప్రమాదం గురించి ఉన్నతాధికారులు రవాణాశాఖ అధికారులతో దర్యాప్తు కమిటీని నియమించారు.

దీని గురించి విచారణ జరిపిన కమిటీ సభ్యులు మంగళవారం ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. బస్సులోని ఆటోమేటిక్‌ గేర్ సిస్టమ్‌ గురించి డ్రైవర్‌ కు సరైన అవగాహన లేకపోవడంతోనే ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది. దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికలోని అంశాల గురించి ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సమీక్ష నిర్వహించారు.

విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్‌ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ప్లాట్‌ ఫాం నంబర్‌ 12 వద్ద జరిగింది. ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు విజయ వాడ నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్లాట్‌ ఫాం పైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌ బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ప్రమాదం ఓ మహిళ, ఓ వ్యక్తి, ఓ చిన్నారి మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్టీసీ తరుఫున రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారికి చికిత్స కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆర్టీసేనే భరిస్తుందని ఆయన వివరించారు.

Also read:టీడీపీ నాయకుల పై 60 వేల కేసులు..గవర్నర్‌కి తెలిపిన నారా లోకేశ్‌!

#vijayawada #bus-accident #ap
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe