Andhra Pradesh: ఫైబర్ గ్రిడ్ పిటీ వారెంట్‌ కేసుపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా..

విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు.

Andhra Pradesh: ఫైబర్ గ్రిడ్ పిటీ వారెంట్‌ కేసుపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా..
New Update

Andhra Pradesh: విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు(CID Officials) దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్(Fiber Grid) పీటీ వారెంట్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై(Chandrababu Naidu) పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు. అయితే, ఈ వాదనల సందర్భంగా చంద్రబాబుని కోర్ట్‌లో హాజరు పరచాలని సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద వాదించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. తీర్పును గురువారం మధ్యాహ్నం పీటీ వారెంట్ పిటిషన్‌పై ఆర్డర్స్ ఇస్తానని తెలిపారు.

ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!

ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్‌పై సీఐడీ తరపున సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు పూర్వపరాలు.. చంద్రబాబు పాత్రపై వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది వివేకా. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సబ్మిట్ చేశారు న్యాయవాది. వాదనలు సందర్భంగా వివిధ కీలకాంశాలను ప్రస్తావించారు. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు పర్చాలని కోరారు వివేకా. జైల్లో ఉన్న చంద్రబాబును మళ్లీ ఫిజికల్‌గా కోర్టు ఎదుట హాజరు పర్చాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు జడ్జి. దీనికి స్పందించిన సీఐడీ న్యాయవాది.. గతంలో కొన్ని కేసుల్లో ఇదే విధంగా వ్యవహరించారని నాటి తీర్పులను ప్రస్తావించారు. కాగా, రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసి.. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు జడ్జి. దర్యాప్తులో భాగంగా చంద్రబాబు పాత్ర ఇప్పటికి నిర్దారణ అయిందని సీఐడీ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

#andhra-pradesh #chandrababu #vijayawada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe