Andhra Pradesh: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత

ముంబై నటికి వేధింపులు..ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న హాట్ టాపిక్. గత ప్రభుత్వం హయాంలో విజయవాడ పోలీసులు ముంబై నటిని వేధించారంటూ కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ పోలీసుల వేధింపుల వెనుక అప్పటి ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Andhra Pradesh: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత

Mumbai Actress: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా బయటపడ్డ ఒక కేసు సంచలనం సృష్టిస్తోంది. ముంబైకి చెందిన ఒక నటిని ఏపీ పోలీసులు వేధించారని...ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేఉలు పెట్ట జలుకు పంపించారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని వెనుక గత ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఉన్నారని చెబుతున్నారు. ఆ నేత విజయవాడ పోలీసులు సహాయతో ముంబై నటిని వేధించడమే కాక ఆమె కుటుంబ సభ్యులను కూడా జైలుకు పంపించారని సమాచారం. అయితే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి రాజశేఖర్ మాట్లాడారు.

అసలేం జరిగిందంటే..

గుజరాత్ కు చెందిన, ముంబై నటి..అక్కడే ఓ బడా వ్యాపార వేత్త మనుమడిని ఆమె ప్రేమించింది. అతను కూడా ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. కానీ బడా వ్యాపారవేత్తకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. దీంతో వారిద్దరినీ విడదీయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక నేతతో డీల్ కుదుర్చుకున్నారు. సినీ నటిని వేధించాలంటూ కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. తన మనుమడి లైఫ్ నుంచి నటిని తప్పించాలని బడా వ్యాపారవేత్త నేతకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ లీడర్...విజయవాడ పోలీసులకు పని అప్పగించారు. ముంబైకి స్పెషల్ టీమ్‌ని పంపించి సినీ నటిని ఇబ్రహీం పట్నానికి తీసుకొచ్చారు. అక్కడ కొండపల్లి ఖిల్లాలో ఆమెను కొన్నిరోజులు ఉంచి వేధించారు. వ్యాపారవేత్త మనుమడితో ఉన్న ఫొటోలను, కాల్ లిస్ట్‌ను డిలీట్ చేశారు. ఆ తరువాత ఆమె కుటుంబం మీద కూడా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన...విద్యాసాగర్‌ అనే వ్యక్తి ద్వారా సినీ నటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయించారు. తప్పుడు పత్రాలు ఇచ్చి రూ.5 లక్షలు వసూల్ చేసినట్టు సాక్ష్యాలు సృష్టించారు. అప్పట్లో దీని మీద బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి నటి కుటుంబం తమకు జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అయితే విజయవాడ కమిషనర్ మాత్రం మాకేమీ ఫిర్యాదులు రాలేదంటూ చెబుతున్నారు.

ఇక మరోవైపు దీనికి సంబంధించి మరో కథనం కూడ వినిపిస్తోంది.ఈ వ్యవహారంలో ఉన్నది వ్యాపారవేత్త మనవడు కాదని.. స్థానిక రాజకీయ నాయకుడి కుమారుడే ఇందుకు కారణమన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. అప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ రాదు.

Advertisment
తాజా కథనాలు