కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం..

బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్లానింగ్, ప్రచార కమిటీ కన్వీనర్లకు చీఫ్‌ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేశారు.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం..
New Update

Vijayashanti: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్లానింగ్, ప్రచార కమిటీని నియమించింది కాంగ్రెస్ పార్టీ(Congress). 16 మంది సభ్యులతో కూడిన ప్లానింగ్, ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కన్వీనర్లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని నియమించింది పార్టీ. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం, ప్లానింగ్ కమిటీ కన్వీనర్స్, చీఫ్ కో-ఆర్డినేటర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడం జరిగిందని కేసీ వేణులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకారం.. చీఫ్ కో-ఆర్డినేటర్‌గా తాజాగా కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతిని నియమించగా.. కన్వీనర్స్‌గా 15 మందిని నియమించారు.

చీఫ్‌ కో-ఆర్డినేటర్..

- విజయశాంతి

కన్వీనర్స్..

- సమరసింహారెడ్డి
- పుష్పలీల
- మల్లు రవి
- ఎం కోదండ రెడ్డి
- వేం నరేందర్ రెడ్డి
- ఎరవాటి అనిల్
- రాములు నాయక్
- పిట్ల నాగేశ్వరరావు
- ఒబేదుల్లా కొత్వాల్
- పారిజాత రెడ్డి
- సిద్ధేశ్వర్
- రామ్మూర్తి నాయక్
- అలి బిన్ ఇబ్రహిం మస్కతి
- దీపక్ జాన్

విజయశాంతికి ఆ పదవా?

ఇకపోతే.. విజయశాంతికి ప్లానింగ్, ప్రచార కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ పదవి ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో ఆమెకు తక్కువ స్థానం ఇచ్చారని, రాములమ్మకు ఇది అవమానమే అని అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ విశ్లేషకులు. కాంగ్రెస్‌లో కంటే బీజేపీలోనే విజయశాంతికి అత్యున్నత గౌరవం లభించిందని అంటున్నారు. బీజేపీలో స్టార్ క్యాంపెయినర్ హోదా ఉండేదని, ప్రధాని మోదీ, అమిత్‌షాతో నేరుగా భేటీ అయ్యేంత చనువు ఉండేదని గుర్తు చేస్తున్నారు. అలాంటి స్టేటస్ ఉన్న విజయశాంతికి.. కాంగ్రెస్‌లో చీఫ్‌ కోఆర్డినేటర్ పదవి ఏంటని అభిప్రాయపడుతున్నారు. ఈ పదవిబట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతికి బీజేపీలో దక్కినంత ప్రాధాన్యత ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం

రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

#telangana-elections-2023 #telangana-elections #telangana-congress #telangana-congress-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe