Telangana : కవిత అరెస్ట్... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో ఇప్పుడు పెద్ద సంచలనం. కేసు ఫైల్ చేసిన ఏడాదికి ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. దీని మీద తెలంగాణ నేతలు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. కాలం కర్మను నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత అరెస్ట్ మీద విజయశాంతి.

Telangana : కవిత అరెస్ట్... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
New Update

Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత ను ఈడీ(ED) అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు చేసిన ఈడీ, ఐటీ అధికారులు ముందుగా వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ(మార్చి 16) రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో కవితను హాజరుపర్చనుండగా.. ఈడీ అరెస్ట్‌ను ఛాలెంజ్‌ చేస్తూ కేసీఆర్‌ కుమార్తే సుప్రీంకోర్టు గడప తొక్కనున్నట్టు తెలుస్తోంది.

కవిత అరెస్ట్ మీద రాజకీయ నాయకులు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. కవిత అరెస్ట్ అక్రమం అంటూ బీఎస్సీ ఛీఫ్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ఖండించారు. మోదీ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు తెర తీసారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కవిత అరెస్ట్ మీద కాంగ్రెస్(Congress) నాయకురాలు, సీనియర్ సినీ నటి విజయశాంతి(Vijayashanti) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు కాలం కర్మను నిర్ణయిస్తుందని... ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. నిజనిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ... తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్టయితే ఎంతో మంచిగుండేదని అన్నారు.

publive-image

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో శుక్రవారం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కు ఈడీ(ED) ఆఫీసులోనే వైద్య పరీక్షలు(Medical Tests) పూర్తి చేయించారు అధికారులు. నేడు కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరపరచనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యచరణను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వస్తారనే అంచనాలతో ముందుగానే ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు.

Also Read : International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

#vijayashanthi #brs-mlc-kavitha #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe