సినీ పరిశ్రమ ఏమి పై నుంచి ఊడిపడలేదు!

ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు అటాక్ కి కౌంటర్ అటాక్ అన్నట్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్‌ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లు తాజాగా చిరంజీవిని టార్గెట్ చేశారు. తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి

సినీ పరిశ్రమ ఏమి పై నుంచి ఊడిపడలేదు!
New Update

ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు అటాక్ కి కౌంటర్ అటాక్ అన్నట్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్‌ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లు తాజాగా చిరంజీవిని టార్గెట్ చేశారు.

తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ప్రభుత్వాలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమని టార్గెట్‌ చేయకూడదని అర్థం వచ్చేలా కామెంట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది.

అయితే ఆ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు ఉన్నాయి కనుక వైసీపీ నేతలు చిరంజీవి పై నిప్పులు చెరుగుతున్నారు. కానీ అసలు చిరు మాట్లాడిన మాటలు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని తాజాగా సినిమా యూనిట్ ఫుల్ వీడియోని విడుదల చేసింది.

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రులు ఆయనకు కౌంటర్లు ఇవ్వగా తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. చిరంజీవి పేరు ఎత్తకుండానే ట్విట్టర్ వేదిక ఆయన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.

సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

గత వారం రాజ్యసభలో సినీ రంగానికి సంబంధించిన బిల్లుపై చర్చలో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ సినిమా రంగంలో సంపాదన కొద్దిమందికి మాత్ర‌మే అందుతోంద‌ని.. సినీ ప‌రిశ్ర‌మ‌లో పని చేసే కార్మికులకు మాత్రం తగిన న్యాయం జరగట్లేదని దాని గురించి ఆలోచించాలని మాట్లాడిన విషయం తెలిసిందే.

#ycp #chiranjeevi #movies #mp-vijayasaireddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe